అమ్మా.. మళ్ళీ అప్పుడే వస్తా!!

Update: 2018-06-29 10:55 GMT

మలయాళం సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత దిలీప్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇద్దరు హీరోయిన్స్ పై అత్యాచారానికి ప్రయత్నించాడు అంటూ అతనిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. కోర్టు వరకు వివాదం వెళ్లడంతో దిలీప్ కు అప్పట్లో బెయిల్ రావడానికి కూడా కష్టమైంది. ఫైనల్ నాలుగవసారి కోర్టు అంగీకారంతో బెయిల్ అందుకున్న దిలీప్ పై అనేక విమర్శలు మళ్ళి వచ్చాయి.

తన బ్యాక్ గ్రౌండ్ తో దిలీప్ సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కామెంట్స్ వచ్చాయి. ఇక అ సంగతి గడిచిన చాలా కాలం తరువాత ఇప్పుడు అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ)  దిలీప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భావన -   రిమా కలింగల్‌ - రమ్య నంబిసన్‌ - గీత్‌ మోహన్‌ దాస్‌ లు అమ్మ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రిజైన్ చేయడం మరింత వైరల్ గా మారింది. వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌(డబ్ల్యూసీసీ) తరపున సమీక్షా నిర్వహించాలని రేవతి పార్వతి పద్మప్రియాలు కోరారు.

మరోవైపు పొలిటిషియన్స్ కూడా వివాదస్పదంగా వ్యాఖ్యలు చేస్తుండడం దిలీప్ కు ఆగ్రహాన్ని తెప్పించింది . అమ్మ సభ్యత్వం తనకు అవసరం లేదని తనపై అనవసరంగా బురద జల్లుతున్నట్లు చెప్పారు. అలాగే తాను నిర్దోషి అని నిరూపించుకున్న తరువాతే అమ్మ సభ్యత్వాన్ని తీసుకుంటాను అని దిలీప్ అమ్మ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
Tags:    

Similar News