తెలుగులో గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో వరుస విజయాలను సొంతం చేసుకొంటున్నారు. అయితే.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వ్యవహరించే వారిలో తాప్సీ ముందు వరసలో ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతోపాటు అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చింది.
బాలీవుడ్ తోపాటు దక్షిణాది చిత్రాల్లో రాణిస్తున్న తాప్సీ పన్ను వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సినీ ప్రముఖులతో అఫైర్లు, డేటింగ్ విషయమై పలు రూమర్లు వినిపించాయి. కానీ.. వాటికి భిన్నంగా డెన్మార్క్‌కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ తో ప్రేమలో పడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మాతియాస్ బోయ్ డెన్మార్క్ తరపున బాడ్మింటన్ క్రీడలో ఒలంపిక్, యూరోపియన్ గేమ్స్ లో రాణించాడు. 2012లో సమ్మర్ ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. అలాగే 2015లో యూరోపియన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకొన్నారు. చాలా ఏళ్లుగా తాప్సీతో డేటింగ్ చేస్తూ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.మాతియాస్ బోయ్‌తో ఎందుకు ప్రేమలో పడ్డాననే విషయంపై తాప్సీ ఇటీవల క్లారిటీ ఇస్తూ.. పలు కామెంట్లు చేసింది తాప్సీ. ‘నాకు మొదటి నుంచి సినీ ఇండస్ట్రీ వారితో రిలేషన్‌షిప్, డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే విభిన్నమైన రంగానికి చెందిన మాతియాస్‌తో ప్రేమలో పడ్డాను. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారాడు’ అని వెల్లడించింది తాప్సీ.
ఇక, తన పెళ్లి గురించి కూడా తాప్సీ క్లారిటీ ఇచ్చారు. తాను ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేయాల్సిందన్న తాప్సీ.. మూడు, నాలుగు సినిమాలకే పరిమితమవుతున్నట్టు చెప్పారు. ఒకసారి తన కెరీర్‌ను గాడిలో పెట్టిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పారు.ఇక, తాప్సీ కెరీర్ చూస్తే.. రష్మీ రాకెట్ చిత్ర షూటింగులో బిజీగా ఉందీ బ్యూటీ. క్రికెటర్ మిథాలి రాజ్ బయోపిక్ కోసం కూడా సిద్ధమవుతోంది. దీనికోసంక్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. అదేవిధంగా.. హసీన్ దిల్‌రుబా, లూప్ లపేటా చిత్రాలతో బిజీగా ఉందీ అమ్మడు. ఈ విధంగా ఇటు కెరీర్.. అటు లైఫ్ ను పక్కా ప్లాన్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది తాప్సీ.