ఎప్పుడో ప్రారంభం అయిన మీటూ ఉద్యం కొన్నాళ్ల క్రితం హాలీవుడ్ లో ఉవ్వెత్తున ఎగసి పడినది, ఆ సమయంలో ఇండియాలో మీటూ ఉద్యమం గురించి పెద్దగా వినిపించలేదు. కాని ఎప్పుడైతే తనూశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక వేదింపులను మీడియా ముందు చెప్పిందో అప్పటి నుండి మీటూ ఉద్యమం ఇండియాలో ప్రారంభం అయ్యింది. పదేళ్ల క్రితం తనను నటు నానా పటేకర్ లైంగికంగా వేదించాడు అంటూ తనూ శ్రీ దత్తా చెప్పడంతో మీటూ అంటూ ఎంతో మంది తాము గతంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు తీసుకు వచ్చాడు.
లైంగిక వేదింపులు ఎదుర్కొన్న ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయట పెట్టడంతో బాలీవుడ్ మొత్తం అతలాకుతం అయ్యింది. మీటూ ఉద్యమం ఇండియాలో ఈ స్థాయిలో ఊపు రావడానికి కారణం ఎవరు అంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు తనూశ్రీ దత్తా. కాని ఆమె మాత్రం ఆ క్రెడిట్ తనకు వద్దు అంటోంది. తన వల్ల మీటూ ఉద్యమం ఇండియాలో ఈ స్థాయిలో ఉంది అంటే మాత్రం ఆమె ఒప్పుకోవడం లేదు.
ప్రస్తుతం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న తనూ శ్రీ దత్తా తాజాగా మీడియాతో మాట్లాడుతూ... మీటూ ఉద్యమంలో తాను చిన్న పార్ట్ మాత్రమే అని, దానికి నేనేం పెద్ద గొప్పగా, గౌరవంగా ఫీల్ అవ్వడం లేదు. మీటూ ఉద్యమం ముందు నేను చిన్న వ్యక్తిని, మీటూ అనేది నా వల్లే అంటూ నేను అస్సలు గొప్పలు చెప్పుకోనంది. ఇండియాకు వీలు చిక్కిన్నప్పుడు తప్పకుండా వస్తాను. నా ఫ్యామిలీని, కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నానంది. ఏ విషయం కూడా నా పై ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఏ విషయం ఏ ఒక్కరిపై ఆధారపడి ఉండదు. నేను లేనంత మాత్రాన మీటూ ఉద్యమం ఆగిపోతుందని నేను భావించడం లేదని తనూశ్రీ దత్తా చెప్పుకొచ్చింది.
Full View