పాకిస్తానీ సినిమాలో నటించడానికి నాకేం ఇబ్బంది లేదు

Update: 2022-12-14 02:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా సౌదీ అరేబియా లో జరిగిన రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నాయి అంటూనే దర్శకత్వంపై ఆసక్తి ఉందని పేర్కొన్నాడు.

అయితే కథలు రాసే విషయంలో తాను చాలా విషయాలను నేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి గా ఉన్నారా అంటూ ప్రశ్నించగా ప్రస్తుతం తాను చేస్తున్న హిందీ సినిమాల్లో పూర్తి సంతృప్తిగా ఉన్నాను అన్నాడు.

ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను కనుక వేరే భాషల్లో సినిమాలు చేయాలి అని అంతా ఆసక్తి.. కోరికలు లేవు అంటూనే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అన్నట్లుగా హాలీవుడ్ సినిమాలపై తనకున్న మోజును చెప్పకనే చెప్పాడు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ అవకాశం వస్తే పాకిస్తాని సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధం అన్నట్లు రణబీర్ కపూర్ పేర్కొన్నాడు.

ఇటీవల పాకిస్తాన్‌ లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్  సినిమా గురించి మాట్లాడిన సందర్భంగా తాను పాకిస్తానీ సినిమాలో నటించేందుకు సిద్ధం అన్నట్లుగా రణబీర్ కపూర్ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే సమయంలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ యానిమల్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరోవైపు ఇటీవలే తండ్రి అవ్వడంతో రణబీర్ కపూర్ కి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News