సీనియర్ నటీమణి జయసుధకు ఇప్పటకీ కేరక్టర్ ఆర్టిస్టుగా ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆమె కోసమే ప్రత్యేకంగా పాత్రల డిజైన్ చేసే కథా రచయితలు.. ఆమెతో నటింపచేయడానికి ఆసక్తి చూపే దర్శక నిర్మాతలు చాలామందే ఉంటారు. అయితే.. కొన్నేళ్ల క్రితం వరకూ జయసుధ సినిమాలు నిర్మించే వారు కూడా.
జేఎస్కే కంబైన్స్ బ్యానర్ పై జయసుధ చిత్ర నిర్మాణాలు చేసేవారు. మొదట సక్సెస్ లు రుచి చూసినా.. తర్వాత ఫెయిల్యూర్స్ వెక్కిరించాయి. "నా ఆస్తుల్లో చాలా భాగం చిత్ర నిర్మాణం కారణంగానే పోగొట్టుకున్నాను. జేఎస్కే కంబైన్స్ బ్యానర్ పై 8 సినిమాలు తీయగా 3 హిట్ అయ్యాయి. తర్వాత అన్నీ ఫ్లాపులే. చివరగా హ్యాండ్సప్ చిత్రం తర్వాత.. ఇక నిర్మాణం వదిలేశాను. ఆ సినిమాతో కలిపి చాలానే ఆస్తులను పోగొట్టుకున్నాను" అని చెప్పారు జయసుధ. అలాగే జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా బస్తీ చిత్రంతో అరంగేట్రం చేశాడు.
ఆ సినిమా ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారామె. శ్రేయాన్ సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా.. తన ఆసక్తిని చూసి సపోర్ట్ చేశానన్న జయసుధ.. అతని తను లాంఛ్ చేయలేదని చెప్పేశారు. సినిమా రంగంలో తన వెనకాల తన గురించి ఎవరేం అనుకుంటారో తెలుసని ఈ నటీమణి చెప్పడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/