పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. `బాహుబలి` ప్రాంచైజీ..`కేజీఎఫ్` ప్రాంచైజీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఇండియాలోనూ వసూళ్ల పరంగా టాప్ -5 లో నిలిచిన చిత్ర మది. `ఆర్ ఆర్ ఆర్` చూడని ప్రేక్షకుడు లేడు. పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అయిన సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా ఫేమస్ అవుతున్నారు. జక్కన్న కాంపౌండ్ నుంచి మరో విజువల్ ట్రీట్ గా నిలిచింది. `ఆర్ ఆర్ ఆర్` రీ రిలీజ్ అమెరికాలో నాన్ ఇండియన్స్ ని సైతం ఫిదా చేసింది. సినిమా చూసొచ్చిన తర్వాత వాళ్ల అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దాదాపు అన్ని ట్వీట్ లు కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నాయి. సినిమా బాగోలేదు అని విమర్శలు ఎక్కడా రాలేదు. హిందీ వె ర్షన్ చూసే నాన్ ఇండియన్స్ అంతగా మెచ్చారంటే..అదే చిత్రాన్ని ఇంగ్లీష్ లో రిలీజ్ చేసి ఉంటే? ఇంకెంత అప్లాజ్ దొరికేదో చెప్పాల్సిన పనిలేదు. ఆ రకంగా సినిమా గ్లోబల్ స్థాయిలోనూ ఫేమస్ అయింది.
సినిమా కోసం వదల కోట్లు వెచ్చించారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మీరు సినిమాలు చూస్తారా? అని ప్రశ్నిస్తే ..సినిమాలవి పెద్దగా చూడను. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు టీవీ పెడితే..ఆ సమయంలో అక్కడ ఉంటే అలా చూసి వె ళ్లిపోతాను. చూడాలని అనిపించదు.
అంత ఆసక్తి ఉండదు. ఈ మధ్య కాలంలో చూసిన సినిమా ఏదైనా ఉంటే? చెప్పండి అంటే కాసేపు నీళ్లు నమిలి. అదేదే ట్రిపుల్ ఆర్ అంట. అప్పుడది టీవీలో పిల్లలు పెట్టారు. అప్పుడే అలా టీవీ వైపు చూసాను. ఒక్క నిమిషం కూడా ఆ సినిమా చూసి ఉండను` అని పాల్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైనా...ఆయన వ్యాఖ్యలు నిజమే అయిండొచ్చు. పాల్ చాలా బిజీగా ఉంటారు. సినిమాలు చూసేంత సమయం ఆయనకు ఉండదు. సినిమాలంటే అంత ఆసక్తి కూడా చూపించారు. ఆయన వ్యాపారాలు..క్రైస్తవ మత ప్రచారంలోనే నిత్యం బిజీగా ఉంటారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పాల్ ఆ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.