అశ్వనీదత్ అనే పేరు వినగానే వైజయంతి మూవీస్ బ్యానర్ గుర్తుకు వస్తుంది. ఈ బ్యానర్ పై ఎన్నో భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలతో ఆయన సినిమాలను నిర్మించారు. అప్పట్లోనే ఈ బ్యానర్ లో భారీ మల్టీస్టారర్ లు వచ్చాయి. చిరంజీవి కెరియర్ లోని మూడు భారీ హిట్లు ఈ బ్యానర్ నుంచి ఉన్నాయి. కొన్ని కారణాల వలన కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న అశ్వనీ దత్, 'మహానటి' సినిమాతో నిర్మాతగా మళ్లీ ఉత్సాహాన్ని పుంజుకున్నారు.
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. 'మహానటి' సినిమాను గురించి ప్రస్తావించారు. "అనుకోకుండా ఒక రోజున సావిత్రిగారి జీవిత్రచరిత్రకి సంబంధించిన పుస్తకం మా ఆవిడ కంటపడింది. సావిత్రిగారి జీవితచరిత్రను సినిమాగా తీస్తే బాగుంటుందని మా అల్లుడితో తనే అంది. అలా 'మహానటి' సినిమాకి అక్కడ బీజం పడింది. 'గోరింటాకు' సినిమా సమయంలో సావిత్రిగారిని నేను చూశాను .. దాసరిగారు నన్ను ఆమెకి పరిచయం చేయారు. ఆమె ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనే విషయం నాకు తెలుసు.
కథ అనుకోగానే మలయాళంలోని ఒక పాప్యులర్ ఆర్టిస్టును సావిత్రిగారి పాత్ర కోసం నాగీ సంప్రదించాడు. "ఇది బయోపిక్ కదా .. చివరిలో సావిత్రి తాగడం వంటి సీన్స్ ఉంటే మాత్రం నేను చేయను అని నాగ్ అశ్విన్ తో చెప్పేశాను" అని ఎవరితోనో ఆ హీరోయిన్ అందట.
ఆ విషయం నా వరకూ వచ్చింది. "నాగీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు .. ఆ అమ్మాయిని పెట్టడానికి మాత్రం వీల్లేదు .. ఆమె ఎవరు స్క్రిప్ట్ ను గురించి కామెంట్ చేయడానికి .. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడు" అని నేను అన్నాను. తను ఎక్కడో చిన్న క్లిప్ లో కీర్తి సురేశ్ ను చూసి, ఆమెనే నా హీరోయిన్ అనేశాడు.
నిజానికి నేను ఈ సినిమాకి వద్దని చెప్పిన ఆ మలయాళ హీరోయిన్ చాలా మంచి ఆర్టిస్ట్. ఆమె గనుక చేసి ఉంటే, సావిత్రి పాత్రను చాలా ఈజీగా చేసేసిందని చెప్పుకునేవారు. కీర్తి సురేశ్ తో చేయించడం వలన వండర్ క్రింద ఫీలయ్యారు.
సావిత్రిగారు బుక్ మా ఆవిడ కంటపడటం .. ఆమె మా అల్లుడితో ఈ సినిమాను గురించి అనడం .. కీర్తి సురేశ్ ఈ సినిమాలోకి రావడం .. ఇదంతా కూడా సావిత్రిగారు కావాలని చేయించుకున్నారేమోనని నాకు అనిపించింది. ఆ సినిమా రిలీజ్ తరువాత నాకు మనవరాలు పుట్టింది. సావిత్రిగారే మా ఇంట్లో పుట్టిందని నేను అనుకుంటూ ఉంటాను" అంటూ చెప్పుకొచ్చారు.