కంగనా మెయిల్స్.. ఫోన్లు పగలగొట్టేవాడట

Update: 2017-10-10 13:07 GMT
ఏ క్షణాన కంగనా రనౌత్ తన మాజీ కోస్టార్ హృతిక్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిందో గాని.. అప్పటి నుండి ఆ వివాదం డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా వివాదం తెరపైకి వచ్చినప్పుడల్లా ఎదో ఒక కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. అదే విధంగా ఆ న్యూస్ చాలా వైరల్ గా మారుతోంది. కంగనా కామెంట్స్ చేసిన తర్వాత హృతిక్ లైట్ తీసుకొని రెండేళ్ల తర్వాత ఆ వివాదంపై స్పందించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని తనే చెప్పుకున్నాడు.

ఆమెను ఇబ్బందికి గురి చేసినట్లు నిరూపించమని ఛాలెంజ్ కూడా విసిరాడు. అంతే కాకుండా తానే సైబర్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. అయితే ఈ మధ్య మరో విషయాన్ని హృతిక్ బయటపెట్టాడు. తన మెయిల్ కు కంగనా మెయిల్ నుంచి తరచు కొన్ని మెయిల్స్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవని అంతే కాకుండా కొన్ని ఫొటోలు కూడా వచ్చేవని చెప్పాడు. దీంతో చాలా ఇబ్బందికి గురయ్యేవాన్నీ అని  చెబుతూ.. కోపంలో కొన్ని సార్లు చేతుల్లో ఉన్న మొబైల్స్ పగులగొట్టానని చెప్పాడు. దీంతో మరో సారి బాలీవుడ్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.

ఇప్పటికే హృతిక్ కి చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ ఖాన్ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. హృతిక్ అలాంటి వ్యక్తి కాదని అనవసరంగా అతనిపై నిందలు వేశారని కామెంట్స్ చేయడంతో పలువురు సినీ ప్రముఖులు సపోర్ట్ గా నిలిచారు. అయితే కంగనా సోదరి రంగోలి కూడా ఆ కామెంట్స్ పై స్పందించింది. బాలీవుడ్ మొత్తం ఎదురొచ్చినా కంగనా ని ఏం చెయ్యలేరు అనే విధంగా కౌంటర్ వేసింది.
Tags:    

Similar News