కాంట్రవర్శీ ఆగిపోయిందని ఫీలవుతున్న స్టార్

Update: 2016-06-20 11:06 GMT
సల్మాన్ ఖాన్ ను రియో ఒలింపిక్స్ లో పోటీ పడబోయే భారత క్రీడాకారుల బృందానికి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించడంపై ఆ మధ్య పెను దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందుకు అతడి వివాదాస్పద నేపథ్యమే కారణం. కొన్ని రోజుల పాటు దీని మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాక.. సచిన్ టెండూల్కర్.. ఎ.ఆర్.రెహ్మాన్.. అభినవ్ బింద్రాలను కూడా గుడ్ విల్ అంబాసిడర్లు నియమించి నిరసన స్వరాలకు కొంత వరకు అడ్డుకట్ట వేసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. నెమ్మదిగా జనాలు ఈ వివాదం గురించి మరిచిపోయారు. ఐతే సల్మాన్ మాత్రం ఈ కాంట్రవర్శీ అంతటితో ఆగిపోయిందే అని తెగ ఫీలైపోతున్నాడు.

‘‘ఈ వివాదం అప్పుడే ముగిసిపోయినందుకు బాధగా ఉంది. ఇంకా కొంత కాలం కొనసాగితే బావుణ్నినిపించింది. ఎందుకంటే రియో ఒలింపిక్స్ గురించి అందరూ తెలుసుకుంటారు’’ అని అన్నాడు సల్మాన్. ఇంతకీ అప్పుడు చెలరేగిన వివాదం మీద ఏమంటారు అని సల్మన్ ను అడిగితే.. ‘‘సచిన్ క్రికెట్ ఆడతాడు.. రెహ్మాన్ మ్యూజిక్ వాయిస్తాడు. వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడంపై ఎలాంటి వివాదం లేదు. నన్ను నియమించడంపై వివాదం చేయడం నిరుత్సాహపరిచింది’’ అని సల్మాన్ అన్నాడు. ఐతే సల్మాన్ అమాయకపు మాటలు చూస్తుంటే ఎవరికైనా నవ్వు రాకమానదు. సినీ రంగానికి చెందిన వాణ్ని నియమించడం మీద కాదు ఇక్కడ వివాదం. తాగి కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైన కేసులో అయ్యవారు నిందితుడు. అంతే కాక కృష్ణజింకల కేసు కూడా ఉంది. ఇంకా ఎన్నో వివాదాలున్నాయి. జనాల అభ్యంతరం దాని గురించి కదా? ఈ సంగతి సల్మాన్ కు తెలియదంటారా?
Tags:    

Similar News