తమిళనాట అజిత్ .. అరవింద్ స్వామి .. అబ్బాస్ కాకుండా అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన మరో హీరో ఉన్నాడు. ఆ హీరో పేరే శ్రీకాంత్. 'రోజాపూలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో పరిచయమయ్యాడు.
అయితే తెలుగులో శ్రీకాంత్ హీరోగా ఉండటంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ తన పేరును శ్రీరామ్ గా మార్చుకున్నాడు. అలా తమిళంలో శ్రీకాంత్ గా .. తెలుగులో శ్రీరామ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం క్రితం తెలుగులో హీరోగా ఆయన చేసిన 'ఒకరికి ఒకరు' సినిమా యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.
ఇక ఆ మధ్య ఆయన 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలోను మంచి రోల్ చేశాడు. తమిళంలో గట్టిపోటీ ఉన్నప్పటికీ తన ప్రత్యేకతను చాటుతూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమమంలో పాల్గొన్నాడు. ఈ షోలో ఆయన ఆలీ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తూ సందడి చేశాడు.
"మా నాన్న తెలుగువారు .. అమ్మ గారిది కుంభకోణం. అందువలన నాన్నతో తెలుగులోను .. అమ్మతో తమిళంలోను మాట్లాడుతూ ఉంటాను.
ఇక నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి .. తెలుగు అమ్మాయినే. తాను సిట్టు అంటే సిట్టు .. స్టాండ్ అంటే స్టాండు. అని శ్రీరామ్ అనగానే, "అబ్బా నేనే అనుకున్నా .. వెల్ కమ్ మై క్లబ్ " అంటూ ఆలీ నవ్వులు పూయించాడు. శ్రీరామ్ మాట్లాడుతూ .. "రసూల్ డైరెక్షన్ లో 'ఒకరికి ఒకరు' చేశాను. అప్పట్లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు. ఆ సినిమా సమయంలో హీరోయిన్ హీరో కి పడుతుందా? డైరెక్టర్ కి పడుతుందా? అని నాకు డౌటుగా ఉండేది. ఆ సినిమాలో సుబ్బలక్ష్మి అనే పాటలో ఇంటిపేర్లు గుర్తుపెట్టుకోలేక చాలా కష్టపడ్డాను.
ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో నా సినిమా షూటింగు జరుగుతోంది. నేను మానిటర్ చూస్తుండగా రజనీ సార్ మ్యాజిక్ లా ఎక్కడి నుంచో వచ్చి వెనకి నుంచి వాటేసుకున్నారు. నేను షాక్ తో చూస్తుండగా "ఏయ్ శ్రీకాంత్ ఎలా ఉన్నావు .. బాగున్నావా? ఈ లుక్ ఎలా ఉంది? ఈ లుక్ గురించి బయట అందరూ ఏమనుకుంటున్నారు? అని అడిగారు. "మీకేంటి సార్ .. మీరు ఎలా ఉన్నా సూపర్ గానే ఉంటారు" అన్నాను నేను" అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఒక షూటింగు సమయంలో తనకి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి ఆయన చెప్పాడు. పూర్తి ఎపిసోడ్ లో ఈ అంశం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పచ్చు.