మైక్రోమ్యాక్స్ మొబైల్ కంపెనీ ఓనర్ రాహుల్ శర్మను అశిన్ పెళ్లాడేస్తోందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరి ప్రేమకథ సుఖాంతం కానుంది. ఈ ఏడాది చివరిలోనే పెళ్లి. ఈ సంగతిని అశిన్ స్వయంగా రివీల్ చేసింది. ఓ ఇంటర్వ్యూ లో రాహుల్ తో ప్రేమాయణం, పెళ్లి ప్లాన్స్ గురించి చెప్పిందిలా...
= నా జీవితంలో ప్రేమ అనుకోకుండానే పుట్టింది. ఇంకా చెప్పాలంటే గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. అనుకోకుండానే రాహుల్ శర్మ ప్రేమలో పడ్డాను. మొదటి సారి ఓ విదేశీ షూటింగ్ కోసం వెళుతున్నప్పుడు ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నాం. హాయ్ చెప్పాడు. నేను కూడా హాయ్ అని చెప్పాను. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. ఇంకేం ఉంది. అప్పట్నుంచి ఫోన్ లో సంభాషణలు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. జెంటిల్మన్ లా అన్నాడే అనుకున్నా. సరే అన్నా. అలా మా మధ్య బంధం మొదలైంది. నాలుగేళ్లుగా ఈ స్నేహం ఇలానే కొనసాగుతోంది. ఇదంతా అక్షయ్ కుమార్ వల్లే. రాహుల్ అతడికి క్లోజ్ ఫ్రెండ్. మేం కలుసుకున్న మొదటి మీటింగ్ లోనే మా మధ్య ఏదో మొదలైందని కనిపెట్టేసి ప్రొసీడ్ అన్నాడు.
=రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయ్. అతడు మతిమరుపు మనిషి. సొంతంగా మైక్రోమ్యాక్స్ ని విస్తరించే పనిలో అలా అయిపోయాడు. అతడు వాడే కార్ కూడా ఆరెంజ్ కలర్. మొబైల్ బ్రాండ్ లోనూ ఆరెంజ్ నే ఉపయోగిస్తున్నాడు. ఇలా చూస్తే మా మధ్య పరిచయానికి గజిని సినిమాకి ఎంతో కనెక్షన్ ఉందంటూ అశిన్ చెప్పుకొచ్చింది. ఇంట్రెస్టింగ్ కదూ?
= అసిన్ చేపలు, మాంసం తినే మలయాళీ. కానీ రాహుల్ శాఖాహారి. ఢిల్లీ స్వస్థలం. బిజినెస్ విస్తరణలో భాగంగా ముంబై లోనూ అతడికి ఆఫీసులు ఉన్నాయి. ఆ పయనంలోనే ఈ ప్రేమాయణం సరిగమలన్నీ. అశిన్ తో వివాహం ఈ ఏడాది చివరిలో ఉండే అవకాశం ఉంది. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పింది.