బ్రహ్మానందం జోరు తగ్గిపోయి చాలా కాలమైంది. ఎమ్మెస్ నారాయణ కాలం చేశారు. వేణు మాధవ్ ఫేడవుట్ అయిపోయాడు. సునీల్ హీరో వేషాలకు పరిమితం అయిపోయాడు. సప్తగిరి మెరుపులు ఎంతో కాలం కొనసాగలేదు. మరి తెలుగు సినిమాల్లో కామెడీ ఎలా వర్కవుట్ చేయాలి. మన ప్రేక్షకుల్ని ఎవరు నవ్వించాలి. మంచి కామెడీ క్యారెక్టర్ ఉంటే.. ఎవరితో చేయించాలి.. అంటే ఎక్కువమందికి కనిపిస్తున్న ఛాయిస్.. వెన్నెల కిషోర్. బోర్ కొట్టించని కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ సాగిపోతున్నాడు కిషోర్. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘కేశవ’ చూస్తే వెన్నెల కిషోర్ స్పెషాలిటీ ఏంటన్నది అర్థమవుతుంది. దీని తర్వాత ‘అమీతుమీ’లో మరో మంచి కామెడీ క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని నవ్వించడానికి రెడీ అవుతున్నాడు కిషోర్.
‘అమీతుమీ’ విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కిషోర్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు చాన్నాళ్ల కిందట ఓ మాట ఇచ్చాడట కిషోర్. ఆ మాట ఏంటని కిషోర్ ను అడిగితే.. ‘‘ఒకసారి ఏదో సినిమా షూటింగ్ లో ఉన్నపుడు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు పిలిచి కామెడీ బాగా చేస్తున్నావ్.. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు అన్నారు. నేను కూడా అస్సలు చేయనని ఒట్టేశాను. నాకు హీరోగా చేసే ఉద్దేశాలు అసలేమాత్రం లేవు. నేనసలు హీరోగా అస్సలు సెట్టవ్వను’’ అని చెప్పాడు. ఐతే ‘అమీ తుమీ’లో మాత్రం తనది హీరోలతో సమానమైన పాత్ర అని కిషోర్ చెప్పాడు. ‘‘ఈ కథలో హీరోలకెంత ప్రాధాన్యం ఉంటుందో నాకూ అంతే స్కోప్ ఉంటుంది. వాళ్లతో పోటా పోటీగా నటించే అవకాశం దక్కింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో వాళ్లకెన్ని సన్నివేశాలుంటాయో నాక్కూడా అన్నే ఉంటాయి’’ అని కిషోర్ అన్నాడు.