సినిమాల్లో చేయక పోవడానికి కారణం ఇదే.. నాగార్జునతో చేయను : అమల

Update: 2022-09-17 15:30 GMT
హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే నాగార్జున ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో బిజీ అయ్యి కుటుంబం కు సమయం కేటాయించడంతో అమల అక్కినేని సినిమాలకు దూరం అయ్యారు. పలువురు ఆమెతో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ చాలా మందికి నిరాశే మిగిలింది. కానీ శేఖర్‌ కమ్ములకు మరియు ఒకే ఒక్క జీవితం శ్రీకార్తిక్ కు మాత్రమే ఆమెతో నటింపజేసే అవకాశం దక్కింది.

లైఫ్‌ ఈజ్ బ్యూటీ ఫుల్‌ సినిమా తర్వాత చాలా ఏళ్ల గ్యాప్ తీసుకున్న అమల అక్కినేని మళ్లీ ఒకే ఒక జీవితం సినిమాలో నటించడంతో అంతా కూడా ఇక నుండి అమల వరుసగా సినిమాల్లో నటిస్తారని అనుకుంటున్నారు. కానీ ఆమె నటన పై ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించడం లేదు. ఆమెకు ఉన్న బాధ్యతల కారణంగా నటించడం సాధ్యం కాదని కూడా పేర్కొంది.

ఒకే ఒక జీవితం సినిమా యొక్క ప్రెస్ మీట్‌ లో భాగంగా అమల అక్కినేని మాట్లాడుతూ లైఫ్‌ ఈజ్ బ్యూటీ ఫుల్‌ సినిమా తర్వాత తెలుగు లో కాకున్నా ఇతర భాషల్లో సినిమాలు వెబ్‌ సిరీస్ లు చేశాను... కాని తెలుగు లో మాత్రం ఇదే. అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్ మీడియా లో ఉన్న వందలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్‌ బాధ్యత నాపై ఉంది. అందుకే నేను సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకోవడం లేదు.

నా సమయ ఎక్కువగా ఆ విద్యార్థుల కోసం కేటాయిస్తున్నాను. నేను వరుసగా సినిమాలు చేయడం వల్ల ఆ బాధ్యత కు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేను. అందుకే నేను వస్తున్న ఆఫర్లు తిరస్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకే ఒక జీవితం మనసుకు హత్తుకునేలా అనిపించింది. అందుకే నటించేందుకు ఒప్పుకున్నాను అన్నట్లుగా అమల అక్కినేని చెప్పుకొచ్చారు.

నాగార్జున తో మళ్లీ మిమ్ములను వెండి తెరపై చూడాలి అనుకుంటున్నాం అంటూ ప్రశ్నించిన సమయంలో.. నాగార్జున మరియు నేను ఎప్పడు కూడా ఇంట్లో కలిసే ఉంటున్నాం. కనుక మళ్లీ ఇద్దరం కలిసి నటించే ఉద్దేశం లేదని అమలా చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఏదైనా మనసుకు నచ్చిన కథలు వస్తే అప్పుడు అయినా నాగార్జున తో అమల నటించేందుకు ఓకే చెప్తారా అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News