మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అమీర్ లాంటి ఉద్ధండుడు రీమేక్ కథలపై ఆధారపడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒరిజినల్ కథల్లో నటించాలని అమీర్ ఖాన్ సహా బాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రముఖుల నుంచి సూచనలు అందాయి. కానీ దానిని అమీర్ పెడచెవిన పెట్టినట్టే కనిపిస్తోంది. లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ తర్వాత కూడా అతడు మరో రీమేక్ కథను ఎంచుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండేళ్లకు పైగా షూటింగ్ లో ఉన్న లాల్ సింగ్ చడ్డా ఆగస్టులో విడుదలైంది. థియేటర్లలో తిరస్కరణకు గురైంది. అమీర్ ఖాన్ కొంత విరామం తీసుకుని తదుపరి సినిమా ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వెళ్లాడు. అక్కడ గత కొన్ని వారాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా సమాచారం మేరకు అమీర్ ఖాన్ మరో రీమేక్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2018లో విడుదలైన స్పానిష్ చిత్రం కాంపియోన్స్ రీమేక్ ను అమీర్ ఎంచుకున్నాడు.
అనేక సార్లు విఫలమై 12 స్పానిష్ ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్న వైకల్యాలున్న జట్టు కథతో ఇది రూపొందింది. శుభ మంగళ్ సావధాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
దర్శకుడికి ఇప్పటికే అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతను ఈ సంవత్సరం షూటింగ్ ప్రారంభించే ప్రణాళికలో ఉన్నాడు. నటీనటులు ఇతర సిబ్బందిని ఖరారు చేశారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించనున్నారు.
అమీర్ ఖాన్ త్వరలో ఇండియాకు తిరిగి వస్తారని భావిస్తున్నారు. అతని చివరి చిత్రం లాల్ సింగ్ చద్దా థియేటర్లలో విడుదలైన డిజాస్టరైంది. సరిగ్గా ఎనిమిది వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.
లాల్ సింగ్ రిజల్ట్ పై అమీర్ తీవ్రంగా నిరాశపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అతడు అహోరాత్రులు శ్రమించాడు. కానీ ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే రీమేక్ లపై విమర్శలు వెల్లువెత్తుతుంటే మరోసారి అమీర్ ఖాన్ రీమేక్ పైనే ఆధారపడడం సబబేనా అంటూ డిబేట్ మొదలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.