బాలయ్యతో బాబి ఇక పాన్ వరల్డ్!
అయితే బాబి మాత్రం తదుపరి బాలయ్య తో ఏ సినిమా చేసినా అది దేశాలే దాటి పోవాలని భావిస్తున్నాడు.
నటసింహ బాలకృష్ణని బాబి ఇక దేశాలే దాటించబోతున్నాడా? ఏకంగా ఇద్దరు పాన్ వరల్డ్ ప్లానింగ్ వేస్తున్నారా? పాన్ ఇండియాది ఏముంది? కొడితే పాన్ వరల్డ్ లోనే కొట్టి చూపించాలని కసితో ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో ఇటీవల రిలీజ్ అయిన `డాకు మహారాజ్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాలయ్య కు వరుసగా ఇది నాల్గవ విజయం. మరో రెండు సినిమాలు విజయం సాధిస్తే డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది.
అందుకే బాలయ్య బోయపాటి `అఖండ-2`ని పట్లాలెక్కించారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రమిది. ఇది పాన్ ఇండియాలో పెద్ద సంచలనమే అవ్వబోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బాబి మాత్రం తదుపరి బాలయ్య తో ఏ సినిమా చేసినా అది దేశాలే దాటి పోవాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అనంతపురం వేదికగా రివీల్ చేసాడు. బాబుతో సినిమా చేస్తే అది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డే షేక్ అవ్వాలన్నారు.
బాలయ్య మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాబి ఆ వ్యాఖ్యలు చేసారు. బాలయ్య మాస్ యాంగిల్ ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. `అఖండ`తో అది పాన్ ఇండియాలో ప్రూవ్ అయింది. ఓటీటీ రిలీజ్...టెలివిజన్ రిలీజ్ లో ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తోనే ఇది అర్దమైంది. అందుకే బోయపాటి `అఖండ-2`ని పాన్ ఇండియాలో చేస్తున్నాడు. జరుగుతోన్న కుంభమేళలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం సక్సెస అయితే బాలయ్య పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తాడు.
అటుపై బాబి రంగంలోకి దిగి బాలయ్య మాస్ ఇమేజ్ ని పాన్ వరల్డ్ కే పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మనసులో ఎలాగూ ఆ ఆలోచన ఉంది కాబట్టి! కథను కాస్త కొత్తగా ట్రై చేస్తే చాలు. బాబి అనుకున్నది జరుగుతుంది.