'స్పిరిట్' తొలి షెడ్యూల్ జకార్తాలోనా?
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇండోనేషియా రాజధాని జకార్తా లో ప్లాన్ చేస్తున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` కి జోరుగా సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాను రాసుకున్న పాత్రలకు ఎలాంటి నటీనటులైతే బాగుంటుంది? అన్న దానిపై సీరియస్ గా దృష్టి పెట్టి పని చేస్తున్నాడు. తన టెక్నికల్ టీమ్ ఇప్పటికే ఫిక్సైందని వినిపిస్తుంది. బ్యాలెన్స్ కీలక నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తవ్వలేదు.
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇండోనేషియా రాజధాని జకార్తా లో ప్లాన్ చేస్తున్నారట. స్రిప్ట్ జకార్త లొకేషన్ డిమాండ్ చేయడంతో సందీప్ రెడ్డి అండ్ కో తొలి షెడ్యూల్ అక్కడ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే సందీప్ ఓసారి జకార్తా లొకేషన్లను పరిశీలించి వచ్చారట. అయితే కన్పర్మేషన్ కోసం మరోసారి తన టెక్నికల్ టీమ్, ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి వెళ్లనున్నారని సమాచారం.
ఫిబ్రవరి తొలి వారంలో జకార్తా పర్యటన ఉంటుందని వినిపిస్తుంది. సినిమాలో ఇదొక్కటే విదేశీ లొకేషన్ అట. మిగతా భాగమంతా ఇండియాలోనే చిత్రీకరణ ఉంటుందన ఇసమాచారం. సాధారణంగా సందీప్ రెడ్డి సినిమా షూటింగ్ అంటే ఇండియాలోనే వివిధ లొకేషన్లలో ఉంటుంది. ఎక్కుగా హైదరాబాద్, ముంబైలోనే జరుగుతుంది. అవసరం మేర సెట్స్ వేసి పూర్తిచేస్తారు. అలాగే సహజ వాతావరణంలోనూ షూటింగ్ నిర్వహిస్తుంటారు.
స్టోరీని బట్టి లొకేషన్ మీద ఆధారపడతారు. అర్జున్ రెడ్డి, యానిమల్ షూటింగ్ ల కోసం ఆయన విదేశాలకు వెళ్లింది లేదు. కానీ స్పిరిట్ డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని ముందే హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు జకార్తా లొకేషన్ డిమాండ్ చేయడంతో అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.