రానా గేమ్ ఆన్.. పర్ఫెక్ట్ టైమింగ్..!
రానా లీడ్ రోల్ లో తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది.
దగ్గుబాటి వారసుడు రానా సినిమాల విషయంలో కాస్త స్పీడ్ తగ్గించాడు. 2022 లో విరాట పర్వం సినిమా తర్వాత ఏవో ఒకటి రెండు సినిమాలు అది కూడా గెస్ట్ రోల్ లాగా చేశాడు తప్ప లీడ్ రోల్ చేసింది లేదు. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వేటయ్యన్ సినిమాలో నటించాడు రానా. ఐతే ఆ సినిమా వల్ల పెద్దగా వచ్చింది ఏమి లేదు. రానా సినిమాల విషయంలో చేస్తున్న ఈ లేట్ వల్ల దగ్గుబాటి ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
రానా లీడ్ రోల్ లో తేజ డైరెక్షన్ లో రాక్షస రాజా సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది. మరోపక్క గుణశేఖర్ తో చేయాల్సిన హిరణ్యకశ్యప సినిమా కూడా హోల్డ్ లో ఉంది. ఆ సినిమా త్రివిక్రం ఆధ్వర్యంలో చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రానా. ఐతే లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రానా లీడ్ రోల్ లో ఒక సినిమా రాబోతుందని చర్చ మొదలైంది.
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రన్ వీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస సినిమా ప్లాన్ చేశాడు. ప్రశాంత్ వర్మ, రన్ వీర్ సింగ్ ఇద్దరు కలిసి కొద్దిరోజులు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఐతే ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి రణ్ వీర్ సింగ్ బయటకు వచ్చేశాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల హీరో వెనక్కి తగ్గినట్టు చెప్పుకున్నారు.
ఐతే ఇప్పుడు ఆ బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ రానా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. రానా ప్రశాంత్ వర్మ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. దాదాపు సినిమా ఓకే అయినట్టే అని టాక్. ప్రశాంత్ వర్మతో రానా సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఖాళీతో పాటు నందమూరి మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తి చేశాకే రానా బ్రహ్మ రాక్షస సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో స్పెషల్ రోల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రానాకి ఒక సాలిడ్ సినిమా పడితే మాత్రం ఒక రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.