సినీనటి యమన... అనగానే చాలామంది గుర్తొచ్చేది ఆమెపై వెల్లువెత్తిన ఆరోపణలే! సినిమాలూ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి యమన - 2011లో అనూహ్యంలో ఒక వ్యభిచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో వ్యవభిచారం చేస్తూ దొరికిపోవడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఘటన తరువాత యమున మీడియా ముందుకు పెద్దగా రావడం మానేశారు. ఎప్పుడు ఎవరు కనిపించినా ఆ ఘటన గురించే అడుగుతూ మనస్తాపానికి గురి చేస్తున్నారని యమున అంటున్నారు.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ఘటన గురించి యమన మాట్లాడారు. బెంగళూరులోని ఐటీసీ హోటల్లో తాను వ్యవభిచారం కేసులో బుక్ అయినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని యమున చెబుతున్నారు. నిజానికి, తాను ఆరోజు ఆ హోటల్ కి వెళ్లలేదనీ - సీసీపీ ఆఫీస్ కి వేరే పనిమీద వెళ్లానని యమున చెప్పారు. అయితే, ఆ ఘటన తరువాత తాను తలెత్తుకుని తిరగలేకపోయానన్నారు. ఆ విషయం చాలా బాధకు గురిచేసిందని చెప్పారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని, అలా చేస్తేనే తన పిల్లలపై ఎలాంటి మచ్చ లేకుండా ఉంటుందని భావించినట్టు చెప్పారు.
అయితే, తాను మరణించాక పిల్లల పరిస్థితి తల్చుకుంటే వారి భవిష్యత్తు ఏమైపోతుందో - ఎటువైపు సాగుతుందో అనే భయం వేసిందని దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని యమున వివరించారు. నిజానికి, ఆ రూమర్స్ వినిపిస్తున్న రోజుల్లో బతకాలన్న ఆశ చనిపోయిందనీ, కేవలం పిల్లల కోసమే గుండె నిబ్బరం పెంచుకుని బతుకుతున్నానని యమున బాధపడుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ఏంటో ఏదో ఒక రోజులు ప్రజలందరికీ తప్పకుండా తెలుస్తాయన్న నమ్మకం తనకి ఉందన్నారు. ఆ ఒక్క ఘటన తన వ్యక్తిగత జీవితంపైనా, కెరీర్ పైనా చాలా ప్రభావం చూపిందని ఇప్పుడు బాధపడుతున్నారు!