బాలీవుడ్ లో డేటింగ్ కహానీలకు కొదవేమీ లేదు. ఇటీవల వరుసగా నటవారసులు తెరకు పరిచయమవుతున్నారు. వీరంతా నటులుగా ఆరంగేట్రం చేయక ముందే స్టాటస్ అందుకోక ముందే...ఎఫైర్లు సాగిస్తూ చర్చల్లోకొస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ నటి కుమార్తె.. యువ నాయికతో ముంబై షికార్లు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. ఇబ్రహీం అందగాడు.. చురుకైన వాడు. పైగా పటౌడీ సంస్థానం నుంచి బరిలో దిగబోతున్న క్రేజీ నటవారసుడు. ఇప్పటికే తన కిల్లర్ లుక్స్ తో గాళ్స్ లో బాగా పాపులర్ అయ్యాడు. ఇబ్రహీం త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడని గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇంతలోనే నటి కుమార్తెతో డేటింగ్ సాగిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అతడు నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీతో డేటింగ్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ నటి పాలక్ తన ఇన్ స్టాలో ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫోటోలను చాలాసార్లు షేర్ చేసింది. అయితే తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తెలిపింది.
మరోసారి ఈ జంట ఆదివారం నాడు ముంబైలో జరిగిన రాక్ సంగీత కచేరీలో కనిపించారు. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. మరి ఈ జంట గురించి డేటింగ్ పుకార్లు వేడి పెంచుతున్నాయి. దీనిపై సైఫ్ ఖాన్ వారసుడు స్పందించాల్సి ఉంది. సైఫ్ ప్రస్తుతం బాలీవుడ్ సహా దక్షిణాదినా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. సైఫ్ నటవారసుడు ఇబ్రహీం తెరంగేట్రంపై సాధ్యమైనంత తొందర్లోనే అధికారిక ప్రకటన రానుంది.
గురూజీ కరణ్ పరిచయం చేస్తున్నారు!ఇతర నటవారసుల్లానే యథావిధిగా సైఫ్ వారసుడిని కూడా బాలీవుడ్ డీన్ కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నటవారసుడు ఇబ్రహీం అలీఖాన్ తొలి చిత్రం కోసం కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కాస్టింగ్ ఎంపికలను ప్రారంభించింది.
ఇబ్రహీం అలీఖాన్ తొలి సినిమాకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఓ సమాచారం మేరకు ఈ చిత్రంతో 12 ఏళ్ల తర్వాత కాజోల్ మళ్లీ తన స్నేహితుడు కం నిర్మాత అయిన కరణ్ తో కలిసి పని చేయనుంది.
అయితే యువహీరో అరంగేట్ర చిత్రంలో కాజోల్ పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కొత్త హీరో ఇబ్రహీం అలీ ఖాన్ నటశిక్షణ ఇప్పటికే పూర్తయింది. డ్యాన్సులు ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తండ్రి లెగసీని ముందుకు నడిపించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో కాజోల్ ఈ చిత్రంలో భావోద్వేగంతో కూడుకున్న బలమైన పాత్రను పోషిస్తుంది. ఇబ్రహీం అలీ ఖాన్ తో మ్యాగ్జిమమ్ స్క్రీన్ సమయాన్ని షేర్ చేసుకోనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.