అక్కినేని నటవారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "ఇచ్చట వాహనములు నిలుపరాదు". 'నో పార్కింగ్' అనే ఉప శీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎస్. దర్శన్ అనే యువ దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తుండగా సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా ''ఇచ్చట వాహనములు నిలుపరాదు" చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సుశాంత్ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తే సేఫ్ అవుతారని ఇండస్ట్రీలోని కొందరు శ్రేయోభిలాషులు ప్రొడక్షన్ టీమ్ కి సలహాలు ఇస్తున్నారట. సుశాంత్ కి పెద్దగా థియేటర్ మార్కెట్ లేదని.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేస్తే సినిమాను లాభాలకి అమ్మేసుకోవచ్చని సూచిస్తున్నారట. అక్కినేని కాంపౌండ్ నుంచి భారీ అంచనాలతో హీరోగా పరిచయమైన సుశాంత్ కి 'చిలసౌ' మినహా సరైన సోలో హిట్ లేదు. ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించినా.. అందులో సుశాంత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.