'చిలసౌ' వంటి సూపర్ హిట్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో సుశాంత్.. చివరగా 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' అనే రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'నో పార్కింగ్' అనేది ఉప శీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. IVNR చిత్రాన్ని ఆగస్టు 27న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కోవిడ్ ఫస్ట్ వేవ్ తరువాత తెలుగు సినిమాలు ఎలాగైతే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా నడిచాయో.. అదేవిధంగా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్రాలు ప్రేక్షకాదరణ తెచ్చుకున్నాయి. స్పెషల్ కంటెంట్ ని ఏ సందర్భంలోనైనా ఆదరించే తెలుగు ప్రేక్షకులు.. నావెల్ కాన్సెప్ట్ తో ఒక విలక్షణమైన థ్రిల్లర్ గా వస్తున్న IVNR చిత్రాన్ని కూడా ప్రోత్సహిస్తారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 'థియేటర్ల వద్ద మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉంది' అంటూ వదిలిన రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది. వెంకట్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అభినవ్ గోమతం - ఐశ్వర్య - నిఖిల్ కైలాస - కృష్ణ చైతన్య ఇతరులు ఇతర పాత్రలు పోషించారు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన IVNR ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేయనున్నారు.