ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప ది రైజ్` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై బన్నీ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
పైగా `పుష్ప` రెండు భాగాలుగా విడుదలవు తుండటం... అందులో తొలి భాగం `పుష్ప ది రైజ్` పేరుతో ఈ నెల 17న వరల్డ్ వైడ్‌గా ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల అవుతుండటంతో సహజంగానే బన్నీ ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ తో వున్నారు. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ తరువాత బన్నీ ఏ సినిమా చేయబోతున్నడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటకే బన్నీ - కొరటాల శివ చిత్రానకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కూడా. కానీ అది ఎప్పుడు మొదలవుతుందన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించి పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్ ల జాబితాలో చేరాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ స్క్రిప్ట్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
అప్పుడెప్పుడో ఇది స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో వుంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇది ఆ నేపథ్యంలో సాగే సినిమా కాదని, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దేశ రాజకీయాలని ఓ కుదుపు కుదిపిన డీమోనిటైజేషన్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని, సమకాలీన రాజకీయాలపై ఓ సామాన్యుడు సంధించిన ప్రశ్నల నేపథ్యంలో దేశ రాజకీయాలపై ఓ సెటైరికల్ గా ఈ సినిమా వుండబోతోందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో బన్నీ స్టాక్ ఇన్వెస్టర్‌గా కనిపిస్తాడని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.