కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత విడుదలైన చిన్న సినిమాలను జనాదరణ లభిస్తుండటంతో మరికొన్ని చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం ''ఇదే మా కథ''. ఇందులో శ్రీకాంత్ - భూమిక - సుమంత్ అశ్విన్ - తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.
''ఇదే మా కథ'' మూవీ థియేట్రికల్ ట్రైలర్ యునిక్ గా డిఫరెంట్ గా ఉందని.. ఇది పూర్తిగా రైడర్స్ రోడ్ ట్రిప్ ఆధారంగా రూపొందిన భారతదేశపు మొదటి ఫీచర్ ఫిల్మ్ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ట్రైలర్ విషయానికొస్తే.. ''మన కష్టానికి కారణం మనిషైతే ద్వేషిస్తాం.. అదే దేవుడైతే విధి రాత అనుకుంటాం.. మన కోరికలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా అది నెరవేరుతుంది'' అని శ్రీకాంత్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది.
నలుగురు రైడర్స్ 3450కిమీ దూరంలో ఉన్న లడక్ వరకు బైక్ రైడ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం.. ఈ ప్రయాణంలో వారికి పరిచయమైన వ్యక్తులు.. ఎదుర్కోవాల్సి వచ్చిన సంఘటనలు.. వారి జీవితాల్లో ఈ జర్నీ ఎలాంటి అనుభవంగా మిగిలింది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. పాతికేళ్ళ క్రితం దూరమైన ప్రేమను తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్.. నాన్న ఆత్మ శాంతి కోసం రాయల్ ఎన్ఫీల్డ్ ఫీచర్ గురించి డెమో ఇవ్వాలని భర్తను ఎదిరించిన భూమిక.. లైఫ్ రిస్క్ చేసి అడ్వెంచర్స్ చేయాలనుకునే సుమంత్ అశ్విన్ ఈ రైడ్ కు వెళ్తున్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది.
ఇది డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఎమోషనల్ జర్నీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో సుమంత్ అశ్విన్ - తాన్యా హోప్ మధ్య లవ్ ట్రాక్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా టచ్ చేశారు. ఈ నలుగురు రైడర్స్ కథేంటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 'ఇదే మా కథ' చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గోళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పృథ్వీరాజ్ - సప్తగిరి - సమీర్ - సత్యం రాజేష్ - శ్రీజిత ఘోష్ - తివిక్రమ్ సాయి - ఆటో రామ్ ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. 'రిపబ్లిక్' సినిమా విడుదలయ్యే తర్వాతి రోజు థియేటర్లలోకి రాబోతున్న ''ఇదే మా కథ'' చిత్రం ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Full View