ల‌వ‌ర్ బాయ్ ఈజ్ బ్యాక్‌

Update: 2016-01-09 03:50 GMT
గ‌త కొన్నేళ్ల‌లో బాగా వెన‌క‌బ‌డి పోయి ఉండొచ్చు కానీ.. ఇప్ప‌టికీ ల‌వ‌ర్ బాయ్ అన్న మాట విన‌బ‌డితే చాలామందికి త‌రుణే గుర్తుకొస్తాడు. నువ్వే కావాలి - ప్రియ‌మైన నీకు - నువ్వు లేక నేను లేను - నువ్వే నువ్వే లాంటి సినిమాల‌తో యువ హృద‌యాల్ని కొల్ల‌గొట్టాడు అప్ప‌ట్లో త‌రుణ్‌. కానీ ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో ఫేడ‌వుట్ అయిపోయాడు. గ‌త కొన్నేళ్ల నుంచి త‌రుణ్ సినిమాల్ని జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశారు. అత‌డి తీరు చూస్తుంటే సినిమాల నుంచి పూర్తిగా దూర‌మైపోయిన‌ట్లే క‌నిపించాడు. ఐతే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ పుట్టిన రోజు (జ‌న‌వ‌రి 8) నాడు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు త‌రుణ్‌.

ఇది నా ల‌వ్ స్టోరీ.. ఇదీ త‌రుణ్ కొత్త సినిమా పేరు. గురువారం హైద‌రాబాద్ లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి అభిమానుల నుంచి స‌న్మానం కూడా అందుకున్నాడు త‌రుణ్‌. పోస్ట‌ర్ల‌లో ల‌వ‌ర్ బాయ్ త‌రుణ్ అని వేయ‌డం విశేషం. గ‌డ్డం పెంచి డిఫ‌రెంటుగా క‌నిపిస్తున్నాడు పోస్ట‌ర్ల‌లో త‌రుణ్‌. త‌మిళ అమ్మాయి ఒవియా ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ర‌మేష్ గోపి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎస్వీ స‌తీష్ నిర్మాత‌. ఓ అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు.. ఎంత బాగా ప్రేమించామన్నదె ముఖ్యం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశార‌ట‌. షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని.. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేస్తామ‌ని త‌రుణ్ వెల్ల‌డించాడు.
Tags:    

Similar News