సినిమా రిలీజ్ కి రెడీ అవుతోందంటే టాలీవుడ్ లో యాంకర్లకు పండగే పండగ.. స్టార్ ల ఈవెంట్ లు, ప్రత్యేక ఇంటర్వ్యూలు వంటి రకా రకాల ప్రమోషన్స్ తో యాంకర్లు హోరెత్తిస్తుంటారు. రిలీజ్ కు వారం పది రోజుల నుంచి రిలీజ్ తరువాత కూడా వీరు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి టైర్ 2 హీరోల వరకు ప్రత్యేక ఇంటర్వ్యూలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఇందు కోసం ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
నచ్చిన యాంకర్ తో ప్రత్యేకంగా చిట్ చాట్ లు ప్లాన్ చేస్తూ ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యేలా చూస్తున్నారు. పీఆర్ టీమ్ ని ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టేలా చేస్తున్నారు. ఇక సినిమాల ప్రమోషన్స్ కోసం స్టార్ యాంకర్లు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మమారాజా రవితేజ, రామ్, గోపీచంద్, రష్మిక మందన్న, నితిన్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ వంటి స్టార్స్ ప్రత్యేకంగా ఓ యాంకర్ ని సెలెక్ట్ చేసుకుని మరీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు.
ఇలా స్టార్స్ ప్రత్యేకంగా చూస్ చేసుకుని ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తుండటంతో సదరు యాంకర్ లు భారీగానే డిమాండ్ చేస్తున్నారట. ఓ మేల్ యాంకర్ తనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం స్టార్స్ తనని పిలుస్తుండటంతో లక్షన్నర నుంచి ఒక్కో ఇంటర్వ్యూకు రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. `సర్కారు వారి పాట` నుంచి `సీతారామం` వరకు ఈ మధ్య విడుదలైన ప్రతీ సినిమాకు సంబంధించిన స్టార్స్ ని సదరు మేల్ యాంకరే ఇంటర్వ్యూలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ట్రెండ్ కి మేకర్స్ గుడ్ బై చెబుతున్నట్టుగా తెలుస్తోంది. `రాధేశ్యామ్` నుంచి స్టార్ డైరెక్టర్ లు, టైర్ టు హీరోలు, యంగ్ హీరోలు, మినిమమ్ రేంజ్ డైరెక్టర్లు స్టార్లని ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ రాజమౌళితో మొదలైనా ఇప్పడు మాత్రం పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. ఒక్కో హీరో సినిమాకు ఒక్కో డైరెక్టర్ లేదా యంగ్ హీరో యాంకర్ గా మారిపోతున్నారు.
అంతే కాకుండా యంగ్ డైరెక్టర్స్ ఓ నలుగురు కలిసి హీరో, డైరెక్టర్ ని ఇంటర్వ్యూలు చేస్తుండటంతో యాంకర్లకు పని లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈ మధ్య ప్రతీ సినిమాకు ఇదే ఫాలో అవుతుండటంతో యాంకర్లకు టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ బోగుతున్నాయని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.