మలయాళంలో స్టార్ హీరోగా దుల్కర్ చక్రం తిప్పుతున్నాడు. మమ్ముట్టి తనయుడే అయినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకుని చెలరేగిపోతున్నాడు. గతంలో మలయాళం నుంచి మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపి వంటి కొంతమంది స్టార్ లు మాత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు మాత్రం తన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేలా దుల్కర్ జాగ్రత్త పడుతున్నాడు. ' ఓకే బంగారం' నుంచి ఇక్కడ దుల్కర్ అభిమానుల సంఖ్య పెరగడం మొదలైంది.
కెరియర్ ఆరంభంలో తన వయసుకి తగినట్టుగా లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన దుల్కర్, ఇక ఇప్పుడిప్పుడే కథల పరంగా .. పాత్రల పరంగా ప్రయోగాల బాట పడుతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అంతేకాదు కథలో తన పాత్రకి తగినట్టుగా కనిపించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. తెలుగులో నానీ .. తమిళంలో ధనుశ్ రూట్ లోనే దుల్కర్ వెళుతున్నాడు. విజయాలతో పాటు ప్రశంసలను అందుకుంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటున్నాడు.
ఇక హీరోలు ఎక్కడికి వెళ్లినా .. హీరో కాకపొయ్యుంటే ఏమయ్యే వారనే ప్రశ్న వాళ్లకి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎదురవుతూనే ఉంటుంది. అదే ప్రశ్న తాజాగా దుల్కర్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా సినిమా వాతావరణంలో పెరగడం వలన హీరోను కావాలనే ఉండేది.
అందువలన ఆ దిశగానే నేను ఆసక్తిని చూపుతూ వచ్చాను. హీరో అయిన తరువాత నిలదొక్కుకోవడానికి అవసరమైన టాలెంట్ ఉండేలా ముందునుంచే మార్గాన్ని వేసుకుంటూ వెళ్లాను. అదే మార్గంలో ఇప్పటికీ నడుస్తూ వస్తున్నాను.
ఒకవేళ నా అంచనాలు తప్పేసి నేను హీరోను కాకపొయ్యుంటే, కారు డ్రైవర్ ను అయ్యుండే వాడినేమో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కార్లు అంటే పిచ్చి. టీనేజ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అనేక రకాల కార్లను వాడాను. కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు తగినట్టుగా కార్లను మార్చేస్తూ ఉంటాను.
కారు డ్రైవింగ్ అంటే నాకు ఇష్టం గనుక, ఆ కోరికను నెరవేర్చికోవడం కోసం కారు డ్రైవర్ ను అయ్యేవాడినేమో" అంటూ సమాధానమిచ్చాడు. ఇటీవల 'కురుప్' .. ' హే సినామిక' సినిమాలతో పలకరించిన దుల్కర్, హను రాఘవపూడి దర్శకత్వంలో 'సీత రామం' అనే తెలుగు సినిమా చేస్తున్నాడు.