ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది.అందం..అభినయమో..ట్యాలెంట్ కారణమా? అన్నది తెలియదు గానీ.. టాలీవుడ్ మాత్రం అమ్మడిని తొలి నుంచి బాగానే ప్రోత్సహిస్తుంది. యంగ్ హీరోల నుంచి ఇప్పుడిప్పుడే సీనియర్ హీరోలకు ప్రమోట్ అవుతోంది. కెరీర్ తొలి నాళ్లలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మడిని తెలుగు పరిశ్రమనే హీరోయిన్ ని చేసింది. నటిగా డే బై డై మరింత షైన్ అవుతోంది.
ఇటీవలే 'పక్కా కమర్శియల్' తో యావరేజ్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇంకా చేతిలో కొన్ని సినిమాలున్నాయి. నాగ చైతన్యతో జంటగా త్వరలో 'థాంక్యూ' చెప్పడానికి రెడీ అవుతోంది. కోలీవుడ్ లో 'సర్దార్' సహా మరో చిత్రం చేతిలో ఉంది. ఇక హిందీలో 'యోధ'లో నటిస్తోంది. ఇలా అన్ని భాషల్లో బిజీగా ఉన్న అమ్మడి ముందుకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
ర్యాపిడ్ ఫైర్ లో ఓసారి బాలీవుడ్ లో షారుక్ సరసన...గీతా ఆర్స్ట్ లో సినిమా ఛాన్స్ వస్తే దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అని ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా టక్కున బాలీవుడ్ అనేసింది. ఆ వెంటనే షారుక్ సరసన ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను అంది. అంటే అమ్మడి దృష్టిలో గీత ఆర్స్ట్ లో సినిమా కన్నా! షారుక్ తో ఛాన్స్ అందుకోవడమే ఇంపార్టెంట్ అని తెలుస్తోంది.
రాశీ సమాధానం ఆమోదయోగ్యమైనదే. బాలీవుడ్ లో షారుక్ తో నటించే ఛాన్స్ దక్కితే ఏ హీరోయిన్ వదులుకుంటుంది? షారుక్ తెరపై తో రొమాన్స్ చేయాలని ఎంతో మంది హీరోయిన్లు కలలు కంటారు. అతని కోసమే పరిశ్రమకి వచ్చిన వారెంతో మంది మోడల్స్ ఉన్నారు. అంతటి బిగ్ షాట్ తో ఛాన్స్ వస్తే ఏ బ్యానర్ అవకాశమైనా..ఎన్నికోట్లు ఆఫర్ చేసినా వదిలేసి వెళ్లిపోరు.
టాలీవుడ్ లో లాంచ్ అయినా..కోలీవుడ్ లో లాంచ్ అయినా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లంతా బాలీవుడ్ లోనే స్థిరపడాలని ఆలోచిస్తుంటారు. కొంత మంది సౌత్ భామల ఆలోచన సైతం అలాగే ఉంటుంది. నేరుగా హిందీ పరిశ్రమలో అవకాశం అంత ఈజీ కాదు. కాబట్టి ఇతర భాషల్లో లాంచ్ అవుతుంటారు.
అటుపై ఛాన్స్ రాగానే బాలీవుడ్ కి దూకేస్తారు. ఈ వరుసలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న రష్మిక మందన్న..పూజాహెగ్డే..సమంత బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.