నేను ఎవరినైనా పెళ్లాడి స్థిరపడబోతున్నానని నాకు కచ్చితంగా తెలిసినప్పుడు.. నేను నా వాడి గురించి మాట్లాడుతాను.. అప్పటివరకూ ఆ ప్రశ్న అడగొద్దు! నా కుటుంబ సభ్యులను ఇవే ప్రశ్నలతో విసిగించవద్దు అంటూ కాస్త కటువుగానే సమాధానమిస్తోంది సోనారికా భదోరియా. 2015లో జాదుగాడు చిత్రంతో తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమా నుంచే తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. ఇటీవల `స్పీడున్నోడు`లోనూ సోనారికా గ్లామర్ షో ఆకర్షించింది. `ఈడోరకం ఆడోరకం`లోనూ ఈ బ్యూటీ ఒక నాయికగా నటించింది. కానీ సరైన హిట్లు లేక తర్వాత తెలుగు పరిశ్రమలో ఆమెకి సరైన అవకాశాలే రాలేదు.
అటుపై బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో నటించింది. ఇంద్రజిత్ అనే తమిళ చిత్రంలోనూ నాయికగా మెప్పించింది. ఇటీవల ఈ భామకు పెద్ద గ్యాప్ వచ్చింది. దీంతో టీవీ సీరియల్స్ లోనూ నటించింది. సోనారికా భదోరియా చివరిసారిగా టెలివిజన్ షో `ఇష్క్ మెయి మార్జావన్` (2019) లో కనిపించింది. అయితే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో కనెక్ట్ గానే ఉంది సోనారిక. ఇన్ స్టా వేదికగా చురుకుగా ఆసక్తికరమైన పోస్ట్ లను క్రమం తప్పకుండా పంచుకుంటోంది. ఇటీవల ఈ బ్యూటీ తన లవ్ లైఫ్ గురించి రకరకాల ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది.
ప్రముఖ సెలబ్రిటీ వికాస్ పరాషర్ తో డేటింగ్ చేస్తోందంటూ కొంతకాలంగా పుకార్లు వస్తున్నా సోనారిక ఇంకా దానిని ధృవీకరించలేదు. గత ఏడాది డిసెంబర్ లో తన పుట్టినరోజున జంటగా కలిసి ఫోజులిచ్చారు. దాంతో ఆ ఇద్దరి మధ్యా ఎఫైర్ అంటూ లింక్ అప్ పుకార్లు ప్రారంభమయ్యాయి.
ఎవరితోనైనా సంబంధంలో ఉన్నారా? అని తననే ప్రశ్నిస్తే.. ఆ ఒక్కటీ అడక్కు అనేస్తోంది. నేను నా కుటుంబం గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను.. ఎందుకంటే నేను ఎప్పటికీ నా ఫ్యామిలీతోనే ఉండబోతున్నానని నాకు తెలుసు. మన లవ్ లైఫ్ గురించి మాట్లాడితే..ప్రజల పూర్తి దృష్టిని దానిపైనే ఉంచుతారు. నేను ఎవరితో డేటింగ్ చేస్తున్నానో.. ఏం జరుగుతుందో.. కలిసున్నారా.. విడిపోయారా.. పెళ్లాడుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు… ఇది చాలా కష్టమవుతుంది. అలాగే ఒకరి భాగస్వామి పరిశ్రమకు చెందినవారు కాకపోతే ప్రజలు ఇంకా ఎక్కువ పరిశోధనలో పడిపోవడం అన్యాయం అని వ్యంగ్యంగా స్పందించింది సోనారిక.
కొన్నేళ్లుగా నా వల్ల ప్రజలు నా స్నేహితులను.. నా తల్లిని.. సోదరుడిని సోషల్ మీడియాల్లో ఇవే ప్రశ్నలు వేయడం నేను చూశాను! అందుకే వ్యక్తిగత వివరాలను ఆన్ లైన్ లో పోస్ట్ చేయకుండా ఉంటాను. నేను ఎల్లప్పుడూ నాకు సంబంధించిన లేదా పరిశ్రమ నుండి వచ్చిన స్నేహితుల లేదా సహనటుల పోస్ట్ లను పంచుకుంటాను. నా భాగస్వామిని అసౌకర్యానికి గురిచేసే పరిస్థితిలో ఉంచడానికి నేను ఇష్టపడను అని అన్నారు.
నిజానికి నేను జీవితం ప్రారంభంలోనే స్థిరపడాలని అనుకున్నాను. కానీ గత రెండేళ్ళలో మగాళ్ల విషయానికి వస్తే కళ్ళు తెరుచుకున్నాయి.. . ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకునే ప్రణాళికలు లేవు. కుటుంబాలు తరచూ ఒక నిర్దిష్ట వయస్సులో వివాహం చేసుకోవాలని మహిళలపై చాలా ఒత్తిడి తెస్తాయి. ఆడాళ్లు ఒత్తిడికి లోనవుతారు. వివాహం చేసుకుంటారు. కానీ నేను ఒత్తిడిలో కుప్పకూలిపోను. నేను స్థిరపడాలని కోరుకునే వ్యక్తిని కలిసే వరకు.. నేను వివాహం చేసుకోను. ఆ వ్యక్తితో నా జీవితాన్ని గడపడానికి నేను సిద్ధంగా ఉన్నానని నా హృదయం తెలుసుకోవాలి.. అని సోనారిక తన ప్రణాళికల్ని వివరించింది.