సోషల్‌ మీడియా వీడాలనుకున్నా సెకండ్‌ వేవ్‌ వల్ల..!

Update: 2021-06-13 07:30 GMT
టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఛలో సినిమా తో పరిచయం అయ్యి గీత గోవిందం సినిమా తో నిలదొక్కుకుని వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం.. హిందీ మరియు కన్నడం సినిమాల్లో కూడా నటిస్తున్న ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఇన్ స్టా గ్రామ్‌ లో ఈమెకు భారీ ఫాలోవర్స్ అయ్యారు. నెట్టింట తెగ సందడి చేసే ఈ అమ్మడు ఇటీవల సోషల్‌ మీడియాను వదిలేయాలని భావించిందట.

రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ.. తాను కొన్ని వారాల క్రితం మానసిక ప్రశాంతత కోసం సోషల్‌ మీడియాను వదిలేయాలనుకున్నాను. సోషల్‌ మీడియా కు పూర్తిగా దూరంగా ఉండాలని భావించిన తాను కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనసాగుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. నేను నా టీమ్‌ సెకండ్ వేవ్ కాస్త కఠినంగా ఉండబోతుందని తెలుసుకున్నాం. అందుకే ఈ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా సాయం చేస్తున్న వారికి మానసికంగా కృంగిపోయిన వారికి అండగా నిలవాలనుకున్నాను.

అందుకే సోషల్‌ మీడియా ద్వారా స్ప్రెడ్డింగ్‌ హోప్ ను ప్రారంభించాను. దాని ద్వారా ఎంతో మంది జీవితాల్లో ఆశను నింపానని భావిస్తున్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియా లో ముందు ముందు కొనసాగే విషయమై రష్మిక క్లారిటీ ఇవ్వలేదు. మానసిక ప్రశాంతత కోసం సోషల్‌ మీడియా ను వదిలేయాలని భావించిన రష్మిక ఆ నిర్ణయాన్ని మార్చుకుని కొనసాగేందుకు సిద్దం అవ్వడం అభిమానులను ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే తెలుగులో పుష్ప తో పాటు మరో రెండు మూడు సినిమాలు కమిట్‌ అయ్యింది. హిందీలో రెండు సినిమాలు తమిళంలో ఒక సినిమా కన్నడంలోనూ రష్మిక నటిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News