ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019 వేడుకలు ఇటీవల ముంబైలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడి తారళలు తళుక్కుమనే డ్రెస్సులతో అందంగా ముస్తాబై వచ్చారు.. ఈ కార్యక్రమం ద్వారా దేశ సినీ రంగంలో పాపులర్ కావడానికి.. జనాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో కాలు పెట్టడమే గొప్ప గౌరవంగా సినీ ప్రముఖులు భావిస్తారు.
అలాంటి వేడుకలకు తప్పిపోయిన ఒక వీధి కుక్క వచ్చింది. ఎంతో మంది సెలెబ్రెటీలు, గొప్పగొప్ప వాళ్లు వచ్చే వేడుకల్లో ఈ వీధి కుక్క చొరబడింది. గ్రీన్ కార్పెట్ మీద తిండి కోసం అటూ ఇటూ తిరుగుతున్న ఈ కుక్క వద్దకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన నటి, హీరోయిన్ అదితి భాటియా వచ్చింది.
కుక్కకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అదితి. దానికి కుక్క తన కాలును లేపి కరచాలనం చేసింది. దీంతో ఇదేదో మంచి కుక్క అనుకొని ఏకంగా మైక్ పట్టుకొని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేసింది నటి అదితి.. ఈ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు కుక్క స్పందించలేదు.. కనీసం మొరగలేదు. సైగలు ఇవ్వలేదు. షేక్ హ్యాండులు మాత్రం ఇస్తూ సహకరించింది. ఈ వీడియోను అదితి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. షేర్ చేసిన రెండు రోజుల్లోనే ఆరు లక్షల వ్యూస్ తో దుమ్మురేపుతోంది. కుక్కను ఇంటర్వ్యూ చేసిన మీరోయిన్ అంటూ నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు.
Full View