IIFA సినిమా ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం..!
IIFA ఉత్సవాలకు ఉన్నప్రాముఖ్యత తెలిసిందే. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అండ్ అవార్డ్స్ 2022 వేడుక తో అభిమానులను థ్రిల్ చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే UAE ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మరణం కారణంగా ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈవెంట్ జూలైకి వాయిదా పడింది. దీనివల్ల ఇప్పుడు IIFA తేదీలను మరోసారి ముందుకు తెచ్చినట్లు అవార్డుల కర్తలు ప్రకటించారు.
IIFA 2022 ప్రీపోన్ అవుతుంది.. జూన్ మొదటి వారంలో వేడుకలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిసింది. IIFA ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ''భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక IIFA వీకెండ్ 22వ ఎడిషన్ మరియు అవార్డులు గప్ప ప్రజాదరణ తో హై డిమాండ్ తో తిరిగి వస్తున్నాయి.
సినిమాటిక్ ఎక్సలెన్స్ ను ప్రదర్శించడానికి ప్రపంచాన్ని ఏకం చేస్తూ IIFA వేడుకలను ధృవీకరించడం సంతోషంగా ఉంది. 2022 జూన్ 2 జూన్ 3 జూన్ 4వ తేదీల్లో వేడుకలు జరుగుతాయి.
ఇవి కొత్త తేదీలు.. యాస్ ఐలాండ్- అబుదాబిలో (మరియు మా మునుపటి కమ్యూనికేషన్ పేర్కొన్నట్లు జూలైలో కాదు) ఈ వేడుకలు సాగుతాయి..అని తెలిపింది.
ఇంతకుముందు యుఎఇ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన తరువాత IIFA జూలై 14-16 వరకు నిర్వహిస్తారని ప్రకటించారు.
కానీ ఇప్పుడు ప్రీపోన్ తేదీల్ని ప్రకటించారు. సల్మాన్ ఖాన్ -రితీష్ దేశ్‌ముఖ్ హోస్ట్ చేయనున్న ఈ ఈవెంట్ లో వరుణ్ ధావన్ - అనన్య పాండే వంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ల అద్భుతమైన ప్రదర్శనలతో గ్లామర్ అండ్ గ్లిజ్ తో వేడుక రక్తి కట్టించనుంది.