ఇళయరాజా పేరెత్తగానే ఈ మధ్య వివాదాలే గుర్తుకొస్తున్నాయి. తన పాటలకు రాయల్టీ చెల్లించకుండా సంగీత కచేరీల్లో ఉపయోగించుకుంటున్నందుకు ఆయన ఇటీవలే దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లీగల్ నోటీసులివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ప్రస్తుత సినిమాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటి సినిమాలు వేస్ట్ అన్నట్లుగా మాట్లాడారాయన. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మామూలు కథల్ని.. నిజ జీవితాన్ని ప్రతిబింబించే కథల్ని భావావేశంతో చెప్పే పద్ధతి కనిపించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ సరైన మార్గంలో వెళ్తోందా.. దారి తప్పిందా అన్నసందేహం కలుగుతోందని ఆయనన్నారు. ఈ విషయంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
వినోదం ముసుగులో కేవలం కమర్షియల్ అంశాలకే ఇప్పటి సినిమాల్లో పెద్ద పీట వేస్తున్నారని.. ప్రేక్షకులు అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు కాబట్టి నిర్మాతలు కూడా అలాంటి సినిమాలనే తీస్తున్నట్లుగా ఉందని ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ప్రస్తుత సినిమాల్లో సున్నితత్వం తగ్గిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా అనేది ఒక వినోదాత్మక మాధ్యమం అయినప్పటికీ మంచి కథాంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాలు తీయొచ్చని ఆయనన్నారు. ప్రస్తుతం తాను సంగీతాన్నందిస్తున్న ‘ఎంగ అమ్మా రాణి’ సినిమాలో మంచి కథ ఉందని.. పిల్లల కోసం గొప్ప త్యాగం చేసే అమ్మ కథ కావడంతో ఈ చిత్రానికి సంగీతాన్నందించడానికి అంగీకరించానని ఇళయరాజా అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/