సంగీతదర్శకుడు ఎం.ఎస్ విశ్వనాథన్ ఇటీవలే సర్గస్తులైన సంగతి తెలిసిందే. 13వ రోజు కర్మ క్రియలు చెన్నయ్ లో జరగనున్నాయి. అయితే అదే రోజు అతడిని స్మరించుకుంటూ ఓ సంగీత కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఎనిలిల్ ఉల్లే ఎంఎస్ వి పేరు తో ఈనెల 27న సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా షో సమర్పకుడు, స్వరమాంత్రికుడు ఇళయరాజా ఓ మాట చెప్పారు.
'నేను సంగీత దర్శకుడిని అవ్వడానికి ఇన్‌స్పిరేషన్ ఎం.ఎస్. ఆయన స్వరకల్పన లోని పాటలే. అవి వింటూనే పెరిగాను. అసలు నేను సృజించిన ప్రతి పాటా అతడి పాదాల చెంతకే చేరాలి' అంటూ ఎంతో వినమ్రతను చాటుకున్నారు. అంతేనా అతడికి స్వరనీరాజనాన్ని అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సంగీత విభావరి కార్యక్రమంలోనే ఎం.ఎస్ పేరిట ఓ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా అంతటివాడే ఎంఎస్ గురించి ఈ రేంజులో ప్రశంసించడానికి అసలు కారణం.. ఆ రోజుల్లో సంగీతానికి అంతటి గుర్తింపు వచ్చింది అంటే ఎంఎస్ వంటి వారి అసాధారణ కృషి వల్లే.
సంగీత సాధన అంటే ఎంతో స్వచ్ఛత, నిష్ఠతో సాగేది. సుస్వర సాధన లోనే ఎంఎస్ మొత్తం జీవితాన్ని గడిపేశారు. సంగీతానికి ఆయువు పోసింది ఈ సీనియర్ కృషి. ఆయన చూపించిన బాటలోనే ఆ తర్వాతి కాలంలో ఎందరో శిష్యులు తయారయ్యారు. అందుకే ఇళయరాజా ఇంతగా చలించిపోయారన్నమాట!