ఇళయరాజాను ఇలా వాడేస్తే ఎలా స్వామీ..

Update: 2015-12-10 07:30 GMT
రమేష్ వర్మ.. దర్శకుడు కావడానికి ముందు పబ్లిసిటీ డిజైనర్. సినిమాల్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో బాగా తెలుసు. తన కొత్త సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ పోస్టర్లు, ప్రోమోలతో బాగానే ఆసక్తి రేపుతున్నాడతను. క్రిస్మస్ కానుకగా ఈ నెల 24న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేస్తున్నాడు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఈ సినిమా గురించి మీడియాలో బాగా చర్చ జరిగేలా చేస్తున్నాడు. ఓవైపు సినిమాకు సంబంధించిన క్రియేటివ్ సైడ్ నరుక్కొస్తూనే.. ఇంకో వైపు ఆసక్తికర వార్తలు వచ్చేలా చూస్తున్నాడు.

ఇందులో భాగంగానే ‘అబ్బాయితో అమ్మాయి’ తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఐతే ఇదేదో వీళ్లకు వీళ్లుగా తీసుకున్న నిర్ణయం కాదట. సినిమా ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోయిన ఇళయరాజా దీన్ని తమిళంలోనూ విడుదల చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. పైగా ఆయనకిది 999వ సినిమా కావడంతో ఆ రకంగానూ ప్రెస్టీజియస్ గా భావించి తమిళంలో విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. తెలుగులోంచి పెద్ద పెద్ద సినిమాలకే తమిళనాట అంతగా ఆదరణ ఉండట్లేదు. ఎంత ఇళయరాజా సంగీతం అందించినప్పటికీ.. హీరో హీరోయిన్లు, దర్శకుడు ఎవరూ పరిచయం లేని సినిమాను తమిళ ప్రేక్షకులు ఎగబడి చూసేస్తారని భ్రమిస్తే ఎలా? అయినా రమేష్ వర్మకు ఈ సంగతి తెలియంది కాదు. ఊరికే ఇళయరాజా పేరు వాడి పబ్లిసిటీ చేసుకుంటున్నట్లుంది వ్యవహారం చూస్తుంటే.
Tags:    

Similar News