రాజా గారికి పద్మ విభూషన్ ఇచ్చారు

Update: 2018-01-25 17:01 GMT
ఆయన మ్యూజిక్ ఆరాధకుడు చేయడం కాదు.. ఆయన కంపోజ్ చేసినట్లు మ్యూజిక్ ఆడుతుంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. ''నాకు మ్యూజిక్ తెలియడం కాదు. మ్యూజిక్ కే నేను తెలుసు'' అంటారాయన. అంతటి దమ్మున్న స్టేట్మెంట్ ఇచ్చే ఏకైక కంపోజర్.. ఇండియాలో ఎవరైనా ఉన్నారా అంటే.. ఖచ్చితంగా అది మన మేస్ట్రో ఇళయరాజా అనే చెప్పాలి.

వివిధ రంగాల్లో తమ సత్తాచాటుతున్న ప్రముఖులకు 2018 సంవత్సరానికి గాను పద్మ అవార్డులు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. దీనిలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్‌ తో పురస్కారంతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. 1943లో జ్ఞానతెసికన్ గా పుట్టిన ఈ కంపోజర్ కు.. ఆయన గురువు ఇళయరాజా అంటూ నామకరణం చేశారు. 1970లలో చక్రం తిప్పడం మొదలెట్టిన ఆయన.. ఇప్పటివరకు 1000కు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. దాదాపు 6500 పాటలను ఆయన భారతీయ సినీ ప్రపంచానికి అందించారు. ఇప్పటివరకు ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్న ఇళయరాజా.. ఈ విధంగా భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించడంతో చాలా ఆనందపడుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇళయారాజా ''తనకు అవార్డును ఇవ్వడం అంటే.. తమిళ ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గుర్తించారనే అనుకోవాలి. ధన్యవాదాలు'' అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే సీనియర్ హీరోలు అయిన రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఆయనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.
Tags:    

Similar News