ఇళయరాజా సాయి ప్రసాద్‌ వివాదం మరింత ముదిరింది

Update: 2020-08-02 11:30 GMT
లెజెండ్రీ ఫిల్మ్‌ మేకర్‌ ఎల్వీ ప్రసాద్‌ చెన్నైలో నిర్మించిన ప్రసాద్‌ స్టూడియోలో కొంత ప్రదేశంను ఇళయరాజాపై గౌరవం మరియు అభిమానంతో కేటాయించడం జరిగింది. దాదాపు నలబై ఏళ్ల క్రితం ప్రసాద్‌ స్టూడియోలో ఇచ్చిన రూంలో ఇళయరాజా తన సంగీత సామ్రాజ్యంను కొనసాగిస్తున్నాడు. ఎల్వీ ప్రసాద్‌ ఇచ్చిన బహుమానంపై ఆయన తర్వాత స్టూడియో బాధ్యతలు చేపట్టిన రమేష్‌ ప్రసాద్‌ వ్యతిరేకత చూపలేదు. రమేష్‌ ప్రసాద్‌ తనయుడు సాయి ప్రసాద్‌ మాత్రం స్టూడియోలో నుండి ఇళయరాజాను ఖాళీ చేయించాలని భావిస్తున్నాడనే విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఈ విషయమై వాదోపవాదనలు జరుగుతున్నాయి.

సాయి ప్రసాద్‌ తనను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఇళయరాజా కోర్టుకు వెళ్లాడు. కేసు కోర్టులో ఉండగా సాయి ప్రసాద్‌ మనుషులతో దౌర్జన్యంకు దిగుతున్నాడట. ఇటీవల ఇళయరాజా స్టూడియో మీదకు వచ్చి విలువైన వస్తువులను పగులగొట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారట. దాంతో చెన్నై కమీషనర్‌ కు ఇళయరాజా మేనేజర్‌ ఫిర్యాదు చేయడం జరిగిందట. సంగీత స్టూడియో లోనికి వచ్చి ఖరీదైన ఇన్టుమెంట్స్‌ ను ద్వసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రసాద్‌ స్టూడియో అభివృద్దిలో భాగంగా ఇళయరాజా స్టూడియోను తొలగించాలని సాయి ప్రసాద్‌ భావిస్తూ ఉండగా ఇళయరాజా మాత్రం సూడియోను ఎక్కడికి తీసేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మద్య తలెత్తిన వివాదంను తమిళ సినీ పెద్దలు పరిష్కరించాలంటూ కొందరు కోరుతున్నారు. ఈ వివాదంకు పోలీసులు అయినా మద్య వర్తిత్వం వహించి ఫుల్‌ స్టాప్‌ పెడితే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News