వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. వెనక్కి తగ్గిన తండ్రి

Update: 2021-09-28 10:30 GMT
తమిళ అగ్రహీరో హెచ్చరికలతో ఆయన తండ్రి వెనక్కి తగ్గాడు. కొడుకైన స్టార్ హీరో పేరుతో పార్టీని స్థాపించి ముందుకెళ్లిన తండ్రి.. చివరకు కొడుకు కోర్టుకు ఎక్కడతంతో వెనక్కి తగ్గక తప్పలేదు. కొడుకు హెచ్చరికలతో పెట్టిన పార్టీని మూసుకున్నాడు.

తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ పేరు ఆయన తండ్రి చంద్రశేఖర్ పెట్టిన పార్టీని రద్దు చేస్తున్నట్టు ఆయన కోర్టుకు తెలిపాడు.  విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని ఆయన తండ్రి పార్టీ పెట్టిన వార్తలు తమిళనాట హీట్ పెంచాయి.ఈ క్రమంలోనే విజయ్ పేరు మీద ఆయన తండ్రి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం.. దాన్ని విజయ్ వ్యతిరేకించడం హాట్ జరిగింది. దీనిపై విజయ్ కు, అతడి తండ్రి ఎస్.ఐ.చంద్రశేఖర్ మధ్య విభేదాలు తలెత్తాయి.  

సీనియర్ దర్శకుడు అయిన చంద్రశేఖర్ తన కొడుకు హీరో విజయ్ పై  పార్టీ పెట్టడం చిచ్చు రేపింది. కొడుకు, తండ్రి మధ్య రాజకీయ పార్టీ విషయమై పరస్పర విరుద్ధ వాదనలు తమిళనాట రాజకీయాన్ని వేడెక్కించాయి. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని.. తాను రాజకీయాల్లోకి రావడం లేదని, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని హీరో విజయ్ స్పష్టం చేస్తూ కొన్ని రోజుల క్రితం ఒక పత్రికా నోట్ జారీ చేశాడు. తన తండ్రి రాజకీయ పార్టీ కోసం తన పేరు మరియు ఫొటోలను ఉపయోగించరాదని హెచ్చరించాడు.

ఇక తన కొడుకు హీరో  విజయ్ పై తండ్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనపై చర్య తీసుకుంటే అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.. "విజయ్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరో కావచ్చు, కానీ అతను ఎప్పుడూ నా కొడుకుగానే ఉంటాడు. నేను చేస్తున్నది నా కొడుకు యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే. విజయ్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆలోచనను ఇష్టపడకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా దాని ప్రాముఖ్యతను గ్రహించి ఒక రోజు నా దగ్గరకు వస్తాడు. విజయ్ నన్ను జైలుకు పంపితే, తన తండ్రిని జైలుకు పంపిన కొడుకుగా చరిత్ర సృష్టించడం ముగుస్తుంది ”అని ఎస్‌ఐ చంద్రశేఖర్ అన్నారు.

చంద్రశేఖర్ స్థాపించిన పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీ కాగా.. తల్లి శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయ్ తన పేరిట పెట్టిన పార్టీపై సీరియస్ అయ్యి ఏకంగా తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు. తనను సంప్రదించకుండా తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంపై తల్లిదండ్రులతోపాటు కలిపి మొత్తం 11 మందిపై చెన్నైలోని సివిల్ కోర్టులో కేసు వేశారు.

విజయ్ తన పేరున తండ్రి పార్టీ పెట్టారని తన ఫ్యాన్స్ ఎవరిని కూడా అందులో చేరవద్దని తెలిపాడు. ఇక తన తండ్రి పెట్టిన పార్టీ కోసం తన పేరు, తన ఫొటోలను ఉపయోగిస్తున్నారని.. అంతేకాకుండా ఫ్యాన్స్ క్లబ్ ను కూడా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై తన పేరుతో ఎటువంటి కార్యక్రమాలు, రాజకీయ మీటింగులు నిర్వహించకుండా ఉండటానికే ఈ కేసు పెట్టానని తెలియజేశారు.

ఈ సందర్భంగా విజయ్ తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ తన కుమారుడు పేరిట ఏర్పాటు చేసిన పార్టీని వెంటనే రద్దు చేస్తున్నట్టు కోర్టుకు తెలిపాడు. అంతేకాదు పార్టీకి సంబంధించిన అన్నింటిని కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలియజేశారు. అంతేకాదు విజయ్ మక్కలు ఇయ్యమ్ రాజకీయ పార్టీగా కాకుండా ఫ్యాన్ అసోసియేషన్ గా కొనసాగించబోతున్నట్లు తెలిపారు.

ఇక  ఈ విషయం గురించి విజయ్ అభిమానులు గట్టిగానే సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. విజయ్ ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగవద్దు అంటూ కోరుతున్నారు. ఆయనను హీరోగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News