సౌత్ లో ఎంజాయ్ చేయలేకపోయా

Update: 2017-07-22 18:02 GMT
తనకు పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమాలను వదిలేసి బాలీవుడ్ కు షిఫ్టయిపోయింది గోవా సుందరి ఇలియానా. టాలీవుడ్ లో కొన్నేళ్లే ఉన్నా దాదాపు పెద్ద హీరోలందరి పక్కన నటించేసింది. జులాయి సినిమా తర్వాత టాలీవుడ్ కు టాటా చెప్పేసింది. రణ్ బీర్ కపూర్ తో కలిసి చేసిన బర్ఫీ హిట్ కావడంతో హిందీలో సెటిల్ అయిపోతానని అనుకుంది. అడపాదడపాగా ఛాన్సులు వచ్చాయే తప్ప సౌత్ లో లాగా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు.

అసలు సౌత్ సినిమాలు ఎందుకు వదిలేసినట్లు అన్నదానిపై ఇలియానా తాజాగా పెదవి విప్పింది.  ‘‘సౌత్ లో నటించిన సమయంలో పెద్ద తప్పు చేశాను. ఒకేసారి బోలెడు సినిమాలకు కమిట్ అయిపోయాను. దీంతో క్షణం తీరిక ఉండేది కాదు. ఒక సెట్ నుంచి మరో సెట్ కు పరుగులు తీసేస్తుండేదాన్ని. దీంతో ఫిలిం మేకింగ్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను’’ అని చెప్పుకొచ్చింది. కాకుంటే సౌత్ సినిమాల్లో ఎన్నో గ్లామర్ రోల్స్ చేశానని, అవన్నీ తనకు ఎంతో నచ్చాయని చెప్పింది.

ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి.  అజయ్ దేవగన్ హీరోగా మిలన్ లూథ్రియా దర్శకత్వంలో బాద్షాహో... అనీస్ బాజ్మీ డైరెక్షన్లో అర్జున్ కపూర్ హీరోగా వస్తున్న ముబారకన్ సినిమాల్లో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ లో పాతుకుపోవాలన్న తన కలలు ఈ సినిమాలతో నెరవేరుతాయని గోవా భామ ఆశతో ఉంది.
Tags:    

Similar News