ఈ బేరసారాలేంది ఇలియానా?

Update: 2015-08-28 20:17 GMT
దక్షిణాదిని వదిలి ఉత్తరాదిపై మోజుతో వెళ్లిపోయింది ఇలియానా. ఆరంభమే అక్కడ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. మొదటి సినమా బర్ఫీ తో విజయం దక్కింది. ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలింఫేర్‌ కూడా దక్కింది. కానీ ఏం ప్రయోజనం? ఆ తర్వాత నటించిన కమర్షియల్‌ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మునకలు వేశాయి. దాంతో ఆశించిన లెవల్‌ హీరోయిన్‌ కాలేకపోయింది.

ఖాన్‌ ల త్రయం నుంచి పిలుపు వస్తుందని ఎంత ఆశగా ఎదురు చూసినా అట్నుంచి పిలుపన్నదే లేదు. అశిన్‌ లా ఖాన్‌ లతో నటించాలన్న కోరికైతే నెరవేరనేలేదు. ఏదైతేనేం... ఇప్పటికి రియలైజ్‌ అయినా సమయం మించిపోయింది. ఇక తెలుగు, తమిళ్‌ లో పిలిచి అవకాశాలిచ్చేవాళ్లే లేరు. సరిగ్గా ఈ టైమ్‌ లో స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ని గెస్ట్‌ హౌస్‌ కి వెళ్లి కలవడం మీడియా కంట పడి పెద్ద రచ్చయ్యింది.

''సగటు అమ్మాయిలా బేరమాడే అలవాటుంది. షాపింగులు చేసేప్పుడు అలానే చేసి స్నేహితుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తా'' అంటూ లేటెస్టుగా ఓ స్టేట్‌ మెంట్‌ ఇచ్చింది ఇల్లూ. అయితే ఈ అమ్మడి బేరం షాపింగుల్లో కుదిరిందేమో కానీ, అవకాశాలు పట్టేయడంలో కుదరలేదు. ఖాన్‌ లతో బేరం ఆడలేకపోయింది.

కనీసం శంకర్‌ తో అయినా బేరం కుదిరిందా? భారీ పారితోషికం అక్కర్లేదు. రోబో2లో ఛాన్సిస్తే చాలు అని బేరమాడిందా? ఏమో ప్చ్‌.. ! ఆశించిన అవకాశం వస్తే అదే బేరం లేని లాభం.
Tags:    

Similar News