ఇష్టం వచ్చినట్లు చేయకండి -ఇలియానా

Update: 2017-08-21 04:16 GMT
తెర పై కనిపించే స్టార్లు బయట కనిపిస్తే వాళ్ళు బయట ఎలా ఉంటారోనని చూడాలనే ఆసక్తి ఉండటం సహజమే. కానీ కొన్నిసార్లు అభిమానుల అతి ఉత్సాహం మన స్టార్లుకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా హీరోయిన్లు ఏదైనా షాప్ ఓపెనింగ్లుకు వచ్చినా కొన్ని పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినా వారి పై కొంతమంది తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు పోకిరి పిల్ల ఇలియానా పై కూడా  ఒక ఆకతాయి తప్పుగా ప్రవర్తిస్తే దానికి ఇలియానాకు కోపం వచ్చి సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెల్లబుచ్చింది.

ఇలియానా ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ‘బాద్షాహో’  సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా  ప్రమోషన్ కోసం ఒక ఈవెంట్ కు వెళ్ళే దారిలో ఆమె పై ఒక ఆకతాయి తప్పుగా ప్రవర్తించాడు. దానికి ఇలియానా ఎంత బాధపడిందో ఆమె రాసిన మేసేజ్ చదివితే మీకే అర్ధమవుతుంది. ఇలియానా ఏమి చెప్పింది అంటే “నేను పబ్లిక్ ఫిగర్నే ఒప్పుకుంటాను. అలా అని మీకు నచ్చినట్లు మాట్లాడినా, ప్రవర్తించినా దాన్ని అభిమానం అనే మేము భావించాలా? మేము మనుషులమే కదా. పైగా నేను ఒక ఆడదాన్ని. మనం ఎలాంటి మూర్ఖుల మధ్య బతుకుతున్నామో నాకు ఇప్పుడే అర్ధమవుతుంది. సినిమా స్టార్స్ కి బయట ఏకాంతం దొరకటం అసాధ్యమే అనే విషయం నాకు తెలుసు కానీ ఎవరికి  నచ్చినట్లుగా వాళ్ళు  పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం సరైన పద్దతి కాదు. ఇలా అంటున్నాను అని ఎవరు తప్పుగా అర్ధం చేసుకోకండి. ముఖ్యంగా అభిమానులు. నేను కొంతమంది మూర్ఖులు గురించి మాట్లాడుతున్నా” అని చెబుతోంది.

ఇలియానా ఇప్పుడు సౌత్ సినిమాలలో కనిపించడమే బొత్తిగా మానేసింది. హిందీలో వరుసుగా సినిమాలు రావడంతో పూర్తిగా ముంబాయిలోనే మకాం పెట్టేసింది. కిందట నెల విడుదలైన ‘ముబారకన్’  సినిమాలో అనిల్ కపూర్ - అర్జున్ కపూర్ లతో నటించి పర్వాలేదులే అనిపించగా.. ఇప్పుడు మిలాన్ లూత్రియ డైరక్షన్లో వస్తున్న బాద్షాహో సినిమా రిజల్టు కోసం వెయిటింగ్. మరి అభిమానులు ఆమె చెప్పింది ఎలా ఆలకిస్తారో చూద్దాం.    
 
Tags:    

Similar News