ఇలియానాను చూస్తుంటే పాపం అనిపిస్తోంది

Update: 2016-01-17 17:30 GMT
మొన్న జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల్లో కాజల్‌ తన క్లీవేజ్‌ షో తో మతిపోగొట్టేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సౌత్‌ నుండి బాలీవుడ్‌ వెళ్లి తన లక్‌ ను చెక్‌ చేసుకుంటున్న తాప్సీ కూడా అదే రేంజులో క్లీవేజ్‌ ఆరబోత ఆరేసింది. అయితే వీళ్లందరూ సరే కాని.. ఇలియాన ఏమైపోయింది? పాపం ఎక్కడా ఏ ఫంక్షన్‌ లో నూ కనిపించట్లేదు. ఔట్‌ డేటెడ్‌ శ్రీయ కూడా అన్ని ఫంక్షన్లలో అలరిస్తున్నా.. ఇల్లీ మాత్రం సిల్లీగా మిస్సింగ్ అంతే.

ఫిలింఫేర్‌ ఈవెంట్‌ లో తన సత్తా చాటలేకపోయిన ఇలియానా.. ఆ తరువాత మరో ఈవెంట్‌ లో మాత్రం ఏదో హడావుడి చేద్దాం అని వచ్చింది. పక్కే శ్రీయ.. నేహా దూపియా.. సోనాల్‌ చౌహాన్‌.. వంటి భామలు కూడా ఉన్నారు. అయితే వారందరి మధ్యలో అమ్మడు తేలిపోయింది అంతే. ఎందుకో అస్సలు ఆనలేదు. గ్లామర్‌ పరంగానే కాదు.. ఎందుకో ఆమె ప్రెజన్స్‌ లోనే ఎటువంటి వైబ్రేషన్‌ లేదని అనిపించేసింది. పాపం అనిపించడం లేదూ.. ఇలియానానూ అలా చూస్తుంటే..

టాలీవుడ్‌ లో ఆఫర్లు వెంటపడినప్పుడు కాదనుకుంది.. ఇప్పుడేమో స్వయంగా ఆమే వచ్చి వెంటపడినా ఇక్కడ ఎవ్వరూ దేఖట్లేదు. సీరియస్‌ గా ఇల్లీ చేజేతులారా చేసుకుందంతే.
Tags:    

Similar News