ఆరేళ్ల లవ్ స్టోరీలో ఇల్లీ లవర్ ఎవరో!

Update: 2017-07-05 17:30 GMT
గోవా బ్యూటీ ఇలియానా బాగా ఓపెన్. ఇంతకు ముందు ఓ విషయాన్ని చెప్పడానికి కనీసం ఆలోచించనైనా ఆలోచించేది కానీ.. ఇప్పుడు మాత్రం మరీ స్పీడ్ అయిపోయింది. ఇదంతా బాలీవుడ్ నీరు ఒంటబట్టడం అనుకోవచ్చు. కానీ ఈమె ముందు నుంచి అంత కంటే స్పీడ్ అయిన గోవాలో పుట్టి పెరిగిన సంగతి మర్చిపోకూడదు.

కొన్ని విషయాలను షేర్ చేసుకోవడంలో హీరోయిన్స్ సాధారణంగా గుట్టు పాటిస్తుంటారు. ముఖ్యంగా లవ్ స్టోరీలు.. ఎఫైర్స్ విషయంలో అయితే ఎంత గుచ్చి గుచ్చి అడిగినా అబ్బెబ్బే అనేస్తుంటారు. కానీ ఇల్లీ మాత్రం మహా స్పీడ్. ప్రస్తుతం తాను ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి ఏ మాత్రం దాచుకోదు సరికదా.. అతడితో కలిసి దిగిన ఎన్నో ఫోటోలను.. అతడు తీసిన మరిన్ని అందమైన ఫోటోలను నెట్ లో షేర్ చేసేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు చూస్తేనే వారిద్దరూ ఎంత క్లోజ్ అనే సంగతి అర్ధమయిపోతుంది.

ఇప్పుడు ఇలియానా తన గతాన్ని గురించి.. అప్పటి లవ్ స్టోరీ గురించి కూడా చెప్పేస్తోంది. 15 ఏళ్లకే ఈ భామ సినిమాల్లోకి అడుగుపెట్టేసిందట. అదేనండీ.. దేవదాసు చిత్రం కోసం ఈమె 15 ఏళ్లకే హీరోయిన్ గా మారిందట. అయితే.. షూటింగ్ రెండేళ్లు సాగిందంతే. అంత కాలంపాటు అమెరికా ట్రిప్ ఉచితంగా వేసే ఛాన్స్ రావడం.. పైగా పారితోషికం రూపంలో పెద్ద మొత్తం అందడంతో తెగ సంతోషించేసిందట.

అంతే కాదు.. ఆ తర్వాత టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చేయగా.. అప్పట్లోనే ఒక హీరోతో బోలెండంత బంధాన్ని పెంచేసుకుందట. ఇద్దరూ ఏకంగా ఆరేళ్ల పాటు డేటింగ్ కూడా చేసేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరు ఇలియానా అని అడిగితే మాత్రం.. దానికి సమాధానం చెప్పడం లేదు కానీ.. తన ఇంటర్వ్యూలో రామ్.. రవితేజలతో తను ఎంత క్లోజ్ అనే సంగతి చెబుతోంది.

ఇన్నేసి సంగతులు ఓపెన్ గా చెప్పిన ఇలియానా.. తన ఆరేళ్ల లవర్ ఎవరనే విషయాన్ని మాత్రం దాచిపెట్టేస్తోంది. ఎంత ఓపెన్ అయినా.. కొన్ని గుట్లు అలా దాచిపెట్టాల్సిందే. లేకపోతే లేనిపోని ఇబ్బందులు వచ్చిపడతాయనే విషయం ఇల్లీకి బాగానే తెలుసు. అందుకే ఆ ఒక్క విషయంలో మాత్రం ఇలా చాకచక్యం ప్రదర్శించేసింది ఈ గోవా భామ.
Tags:    

Similar News