ఫోటో స్టోరి: ఏలియన్ ​​ఇలియానా!!

Update: 2017-07-13 04:30 GMT
హీరోయిన్లు అంటే కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాదు కొన్ని ప్రాడెక్ట్స్ ప్రచారం చేస్తూ వ్యాపార వాణిజ్యలుకు వినియోగదారులుకు మధ్య  వారదిగా ఉంటూ సినిమాలో పాత్రను ప్రచారం లో ప్రాడక్ట్ను చేరవేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫ్యాషన్ ఇండస్ట్రిలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు. డిజైన్ చేసేవాళ్ళుకు  హీరోయిన్లు ఒక మీడియం మాత్రమే. వీళ్ళ అందానికి వాళ్ళ ఆలోచన తోడై మరింత గొప్పగా కనపడటం కోసం వాడతారు. ఇప్పుడు ఒక మ్యాగజైన్ కోసం నడుం సుందరి ఇలియానా షూట్ చేయగా.. అది క్రియేటివిటి ముసుగులో ఏలియన్ ముఖంలా ఉందంటున్నారు నెటిజన్లు.

పక్క గ్రహం నుండి వచ్చిన గ్రహంత్రవాసి చూస్తినట్లు ఏదో వెతుకుతునట్లు కనిపించిది ఇలియానా. చారలు, రింగులు వింతైన ఆభరణాలు లోతైన చూపులుతో అందరిని మరో లోకానికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఏలియన్ లా ఉంది కదూ అని నెటిజన్లలో చర్చ మొదలైంది. తన సహజ అందానికి దూరంగా ఏ అర్ధానికీ అందని విధంగా చూస్తూ.. చాలా కొత్తగా కనిపించిది గోవా గాళ్‌. ఎప్పుడూ తన మేను మెరుపుతో కవ్వించే నవ్వుతో మురిపించే ఇలియానా ఇలా ఎందుకు తయారైంది అంటారు? మరి ఆ ఫ్యాషన్ మ్యాగజైన్ లో ఉండే విషయమేంటో ఈ సారి వాళ్ళు ఎంచుకున్న లైఫ్ స్టైల్ డిజైన్ ఏంటో ఆ మ్యాగజైన్ వాలకే తెలియాలి. మీకు కూడా తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం ‘వెర్వ్ మ్యాగజైన్’ కొని చదవచ్చు.

‘బర్ఫీ’  సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ‘రుస్తోమ్’ సినిమాతో ఒక మోస్తరు స్టార్ అయన ఇలియానా ఇప్పుడు హిందిలో బాగానే హవా హవా చేస్తుంది. ‘ముబారకన్’ సినిమాలో అర్జున్ కపూర్ కు జంటగా నటిస్తుంది కూడాను. ఈ సినిమాలో పాటలు ఈ మధ్యనే  యూట్యూబ్ లో విడుదలై కుర్రకారుని పార్టీ మూడ్లోకి తీసుకువెళ్ళాయి. ఇలియానా తన కొ స్టార్ అర్జున్ కపూర్ తో పండించిన కెమిస్త్రీ.. టాక్ ఆఫ్‌ ముంబాయి గా మారింది.​
Tags:    

Similar News