తెలుగులో అరడజను సినిమాలలోపే చేసిన మాళవిక, తమిళంలో మాత్రం 30 సినిమాలకి పైగా చేసి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. వివాహమైన తరువాత సినిమాలకు బై చెప్పేసిన ఆమె, 'ఆలీతో సరదాగా' కార్యక్రమం కోసం 12 సంవత్సరాల తరువాత కెమెరా ముందుకు వచ్చారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆమె ఈ వేదిక ద్వారా పంచుకున్నారు. తెలుగులో శ్రీకాంత్, తమిళంలో అజిత్ .. రజనీకాంత్ తో తనకి ఎదురైన సంఘటనలను గురించి ఆమె ప్రస్తావించారు.
'చాలాబాగుంది' సినిమా కోసం ఈవీవీ గారు ఒక రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. నేను .. శ్రీకాంత్ గారు ఆ సాంగ్ లో చేయాలి. ఆ డాన్స్ మూమెంట్స్ నాకు అంత కంఫర్టుగా అనిపించలేదు. దాంతో ఆ విషయమే నేను చెప్పాను. శ్రీకాంత్ గారికి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మూడు రోజుల పాటు ఆ పాటని షూట్ చేసినా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇక అజిత్ సినిమా సమయంలోను ఇలాంటి సంఘటనే జరిగింది. 'ఉన్నై తేడి' సినిమా కోసం దర్శకుడు సుందర్ సి. న్యూజిలాండ్ లో సాంగ్ ప్లాన్ చేశారు.
నాకు డాన్స్ పెద్దగా రాదు .. అందువలన అజిత్ కి తగినట్టుగా నేను ఫ్రీ మూమెంట్ ఇవ్వలేకపోయాను. అప్పుడు ఆయన కూడా చాలా అసహనంగా ఫీలయ్యారు. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇక 'చంద్రముఖి' సినిమా కోసం నేను రజనీకాంత్ గారితో కలిసి పనిచేశాను. ఒక సీన్లో ఆయనతో నేను ఒక డైలాగ్ చెప్పాలి. ఆయన నా కళ్లలోకే చూస్తుంటే డైలాగ్ మరిచిపోతున్నాను. "సార్ మీరు ఎటో ఒక వైపు చూడండి .. నా కళ్లలోకి చూస్తుంటే నేను డైలాగ్ మరిచిపోతున్నాను" అని ఆయనతోనే చెప్పాను. నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి .. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం.
షూటింగు గ్యాప్ లో ఆయన చాలా సరదాగా మాట్లాడేవారు. అప్పుడే నేను ఆయనతో "సార్ .. మీరు స్టైల్ గా సిగరెట్ తాగడం .. స్పెట్స్ స్టైల్ గా పెట్టుకోవడం .. స్టైల్ గా నడవడం చేస్తుంటారు గదా. అలా చేయాలని ఎవరైనా చెప్పారా? మీకే ఆ ఆలోచన వచ్చిందా? అని అడిగాను. అప్పుడు ఆయన "నేను అంత హ్యాండ్సమ్ కాదు .. కానీ ఆడియన్స్ ను 3 గంటల సేపు ఎంటర్టైన్ చేయాలి. అందుకే నేను ఇలాంటి ట్రిక్స్ చేస్తుంటాను" అని చెప్పారు. ఇక కమల్ సార్ విషయానికి వస్తే ఆయన సూపర్ టాలెంటెడ్. అజిత్ విషయానికి వస్తే ఆయన మేకప్ పెద్దగా వేసుకోరు .. ప్రతి షాట్ కి ముందు ఫేస్ వాష్ చేసుకుంటారు అంతే. విజయ్ మాత్రం సెట్లో చాలా సైలెంట్ గా ఉంటారు" అని చెప్పుకొచ్చారు.