రాజ్ కుంద్రా పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతున్న సంగతి తెలిసిందే. యాప్ ల మాటున రియల్ బిజినెస్ బయటపడింది. కెమెరా మాటున రాజ్ కుంద్రా నీలి చిత్రాల చీకటి కోణం ఒక్కొక్కటిగా బయటకొస్తుంది. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇంకెన్ని రకాల కేసులు కుంద్రాపై దాఖలు అవుతాయో కూడా తెలియని పరిస్థితి. తాను చేసిన తప్పుడు పనికి రాజ్ కుంద్రా కుటుంబమంతా నింద మోయాల్సి వస్తోంది. భార్య శిల్పాశెట్టి కూడా పోలీసుల విచారణకు హాజరవుతోంది. శిల్పాశెట్టి ఇప్పుడు కనీసం ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆమెను అన్ని రకాలు లాక్ చేసి పెట్టారు. ఇందులో ఆమె పాత్ర ఉందా? లేదా? అన్నది పక్కనబెడితే శిల్పాశెట్టి ప్రొఫెషనల్ కెరీర్ మాత్రం ఢమాల్ అయిందనే ప్రచారం ఇప్పుడు బాలీవుడ్ మీడియాని కుదిపేస్తోంది.
ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి `సూపర్ డాన్సర్ -4` రియాల్టీ షో నుంచి ఎగ్జిట్ అయింది. అయితే ఆమె ఇలా ఎగ్జిట్ అయిన కారణంగా 2 కోట్ల వరకూ నష్టపోయింది. ఆమె స్థానంలో ఇప్పుడు సోనాలీ బింద్రేని నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారు. మరి ఈ రియాలిటీ షో నుంచి శిల్పాశెట్టి తప్పుకుందా? లేక నిర్వాహకులే ఆమెను తప్పించారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రకరకాల రియాలిటీ షోల ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరైన శిల్పాశెట్టి ఇప్పుడు అందరికీ దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి సూపర్ డాన్సర్ నుంచి శిల్పా తప్పుకుంది. ఇంకా ఆమె పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో వాటి నుంచి కూడా ఉద్వాసన తప్పదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
దశాబ్ధానికి పైగా శిల్పాశెట్టి బుల్లితోర షోల్లో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడిలా ఉన్నట్లుండి ఒక్కో షో నుంచి ఎగ్జిట్ అవ్వడంతో బుల్లి తెర కెరీర్ కూడా ముగిసినట్లేనని ప్రచారం జోరందుకుంది. బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత శిల్పాశెట్టి సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా భర్త కుంభకోణం నేపథ్యంలో వెండి తెర ఆఫర్లకు కూడా బ్రేక్ పడడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
సాటి తారల మద్ధతు ఊరట:
అడల్ట్ ఫిల్మ్ రాకెట్ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్టు కారణంగా శిల్పా శెట్టి కి సాటి తారల నుంచి మద్ధతు లభించడం కొంతవరకూ ఊరట. నటి హన్సల్ మెహతా నుంచి శిల్పాకు మద్దతు లభించింది. రిచా చద్దా తనకు బాసటగా నిలిచారు. మగాళ్ల తప్పులకు మహిళలను నిందించడం సరికాదని రిచా చద్దా కౌంటర్ ఎటాక్ చేశారు. కొన్ని న్యూస్ పోర్టల్స్.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లపై శిల్పా దావా వేసిన కొన్ని రోజులకు హన్సల్.. రిచా స్పందించి ఆమెకు మద్ధతుదారులుగా నిలిచారు. ఫిలింమేకర్ హన్సల్ మెహతా శిల్పాకు మద్దతుగా ట్వీట్ చేశారు. కష్ట సమయాల్లో తన గౌరవాన్ని గోప్యతను కాపాడాలని ప్రజలను కోరారు. మీరు శిల్పాశెట్టి కోసం నిలబడలేకపోయినా కనీసం వదిలివేయండి. చట్టం నిర్ణయించనివ్వండి. ఆమెకు కొంత గౌరవం.. గోప్యతను ఇవ్వండి. ప్రజా జీవనంలో ప్రజలు చివరకు తమను తాము రక్షించుకోవడం ముఖ్యం. న్యాయం జరగకముందే దోషులుగా ప్రకటించడం దురదృష్టకరం అని హన్సల్ కోరారు.
శిల్పా చట్టపరమైన సంక్షోభంలో చిక్కుకుంది. అయినా పురుషుల తప్పులకు మహిళలను నిందించే వారంతా సరికాదని రిచా ట్వీట్ చేసింది. పురుషుల తప్పులకు మహిళలను నిందించడం ద్వారా ఒక జాతీయ క్రీడను రూపొందించాం. అలాంటివారిపై ఆమె దావా వేసినందుకు సంతోషంగా ఉంది`` అని రిచా వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం.. హానికరమైన పరువు నష్టం కలిగించే కంటెంట్ ప్రచురించినందుకు అనేక న్యూస్ పోర్టల్స్ సోషల్ మీడియా వేదికలపైనా శిల్పాశెట్టి దావా వేయగా కోర్టు దానిని తిరస్కరించిన సంగతి తెలిసినదే.