'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెర తీశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఇబ్బందికి గురి చేస్తుందన్న ఆయన.. తన మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నారన్న వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న వ్యాఖ్యలన్ని కూడా ఇండస్ట్రీలో వ్యక్తిగా అంటూ చెప్పుకోవటం ద్వారా.. తన తీరును చిత్రపరిశ్రమకు చెందిన వారు చాలామంది ఆమోదించరన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
తన ప్రసంగంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అత్యధిక సమయాన్నివెచ్చించగా.. సినిమా ఇండస్ట్రీకిచెందిన వారంతా తమకు వచ్చిన సమస్య గురించి ఓపెన్ కావాలన్నారు. విభేదాలు ఉండొచ్చు.. సమస్య వచ్చినప్పుడు అందరూ మాట్లాడాలి కదా? అన్న ఆయన.. మీడియాను వదల్లేదు. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వేళ.. మీడియా ప్రసారం చేసిన కథనాలు.. ఇచ్చిన ప్రాధాన్యత.. ఇచ్చిన కవరేజ్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరిగిన సమయంలోనే.. ఆరేళ్ల చిన్నారిపై హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సైదాబాద్ లోని ఒక కాలనీలో హత్యాచారం జరగటం తెలిసిందే. మొదట్లో తేజ్ ప్రమాదంపై కవర్ చేసినంతగా ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఫోకస్ చేయలేదు. దీనిపై.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో పాటు.. ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. దీంతో.. దెబ్బకు సెట్ అయిన మీడియా.. తన ప్రాధాన్యతల్ని మార్చుకోవటం.. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై సింగిల్ కాలమ్ వార్తనే ఇవ్వటం షురూ చేశారు. అయితే.. పవన్ తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. సోషల్ మీడియా ప్రభావం ఆయన మీద ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆయన కొన్ని విషయాల్ని మిస్ అయినట్లుగా చెబుతున్నారు.
ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి మొదట్లో దక్కని ప్రాధాన్యత తర్వాత దక్కటం.. చివరకు ఆ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసే లోపే.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదంపై మీడియాలోని కొన్ని సంస్థల వారు మితిమీరిన రీతిలో వార్తల్ని టెలికాస్టు చేయటం.. వినూత్నం పేరుతో వారు చేసిన వేషాలు.. మీడియా వర్గాల్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే.. ఒకరిద్దరు చేసే ఎదవ చేష్టల వల్ల మొత్తం మీడియా కమ్యునిటీనే తప్పు పడతారు. వేలెత్తి చూపిస్తారు. పవన్ మాటల్ని చూసినప్పుడు.. ఆయన ప్రస్తావించిన అంశాల్నిపరిశీలిస్తే.. అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు ఛానళ్ల కథనాల లైన్ ను ప్రస్తావించటం ద్వారా తానేం చెప్పదలుచుకున్నది చెప్పేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీడియా సినిమా వాళ్ల మీద స్టోరీల్ని విపరీతంగా చేస్తుంది కానీ.. పొలిటికల్ కరప్షన్ మీద మాత్రం ఫోకస్ చేయలేదన్న ఆరోపణను సంధించారు. ఒకవేళ నిజంగానే అలా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుకు రాజకీయ నేతల దరిద్రపు గొట్టు పనులు.. వారు చేసే చీకటి ఒప్పందాల విషయాలతో సహా అనేక అంశాల్ని మీడియా కథనాల్ని ప్రసారం చేస్తోంది. పవన్ చెప్పినట్లుగా.. తేజ్ ప్రమాదం మీద ఓవరాక్షన్ చేసింది కొందరైతే.. అందరికి దాన్ని అంటకట్టేయటం పవన్ చేసిన తప్పుగా చెప్పాలి.
అదే సమయంలో.. ఈ రోజుకు పొలిటికల్ కరప్షన్ గురించి కథనాల్ని కొన్ని మీడియా సంస్థలు నేటికి ప్రచురిస్తున్నాయి.. టెలికాస్ట్ చేస్తున్నాయి. కానీ.. అదేమీ లేనట్లు.. మీడియా అసలు పట్టించుకోవటం లేదన్నట్లుగా వ్యాఖ్యానించటం సరి కాదంటున్నారు. మీడియా గురించి మాట్లాడే సందర్భంలో పవన్ సంయమనం పాటిస్తే బాగుండేదని చెప్పాలి. కొందరు చేసిన తప్పుల్ని అందరికి అపాదించటం ఆయన చేసిన మొదటి తప్పు అయితే.. ఆయన చెప్పిన స్పైసీ స్టోరీలలో కొన్నింటిని ఇప్పటికే కొన్ని వార్తా సంస్థలు ప్రచురించాయన్నది మర్చిపోకూడదు.
విమర్శించటం తప్పు కాదు. కానీ.. అందులో సహేతుకత చాలా అవసరం. సినిమా వాళ్లను అంటే ఏమీ అనరని.. అదే రాజకీయ నేతల్ని అంటే.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొడతారన్న పవన్ మాటలు సరికాదన్నది ఆయన గుర్తించాల్సిన అవసరంఉంది. అందరిని ఒకే గాటున కట్టేయటం పవన్ స్థాయికి సరికాదని.. మీడియా మీద చురకలు వేయటం తప్పు కాదు. కానీ.. జనరలైజ్ చేసి.. గుప్పెడు మంది చేసిన తప్పుల్ని అందరికి అంటగట్టేయటంలోనే అసలు సమస్యంతా. ఈ విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.