బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ వివాదాస్పద వైఖరిపై నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. బాలీవుడ్ మాఫియా సహా మహారాష్ట్ర రాజకీయ నాయకులపైనా కంగన వార్ నడిపిస్తోంది. ఇంతకుముందు కంగన ఇల్లు కార్యాలయాల్ని ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేసిన అనంతర రాజకీయ పరిణామాల గురించి తెలిసినదే. ఇక కంగన పై ఇప్పటికే బోలెడన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల పరిధిలో విచారణలు సాగుతున్నాయి. అయినా వేటినీ కంగన ఖాతరు చేయడం లేదు. నిరంతరం తన స్వేచ్ఛా బాణిని అనుసరిస్తోంది.
తాజాగా తన పాస్ పోర్ట్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకం కలగడంతో కంగన బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. కంగనా రనౌత్ పాస్ పోర్ట్ సెప్టెంబర్ 15 తో ముగియనుంది. అయితే ధాకాడ్ షూట్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉంది. కానీ పెండింగ్ లో ఉన్న కేసుల వల్ల పాస్ పోర్ట్ అథారిటీ పునరుద్ధరణ అప్పీల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మునవర్ అలీ కేసులో తనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావడంతో పాస్ పోర్ట్ పునరుద్ధరణకు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కంగనా బొంబాయి హైకోర్టుకు వెళ్లారు. జూన్ 15 నుండి 2021 ఆగస్టు 30 వరకు తన చిత్రం ధాకాడ్ షూటింగ్ కోసం కంగన బుడాపెస్ట్ వెళ్ళవలసి ఉంది. అందువల్ల ఆమె దరఖాస్తును దాఖలు చేస్తూ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ దరఖాస్తును ఈ రోజు బొంబాయి హైకోర్టు విచారించనుంది. హైకోర్టు ముందు తన హక్కులను రాజీ పడేది లేదని కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దికే వాదిస్తున్నారు.
న్యాయవాది రిజ్వాన్.. కంగనా ప్రయాణ ప్రణాళికలను కోర్టుకు తెలియజేస్తూ.. ధాకడ్ షెడ్యూళ్లకు వెళ్లాల్సి ఉందని... ప్రొడక్షన్ హౌస్ దీనికోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో కంగనా తన భాగం చిత్రీకరణకు హాజరు కావాలని హైలైట్ చేశారు.
2020లోనే కంగనా ఆమె సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియా పోస్టుల్లో మత హింసను ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని ఇద్దరూ విజ్ఞప్తి చేసిన తరువాత ముంబై పోలీసుల అరెస్టు.. బలవంతపు చర్యల నుండి ఇద్దరి సోదరీమణులకు కోర్టు రక్షణ కల్పించింది. అటుపై కంగన తన కుటుంబంతో మనాలిలో గడిపిన తరువాత ఇటీవల ముంబైకి తిరిగి వచ్చింది. కంగన తలైవి- ధాకాడ్- తేజస్ లాంటి చిత్రాల్లో నటించాల్సి ఉంది.