టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రిపుల్ రోల్ లో నటించినా హీరోలు చాలా తక్కువ మందే వున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ ఫీట్ ని సాధించారు. నందమూరి తారాక రామారావు 'దానవీర శూరకర్ణ' మూవీలో ఎన్టీఆర్ ..కర్ణుడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా నటించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ఫీట్ ని మెగాస్టార్ చిరంజీవి 'ముగ్గురు మొనగాళ్లు' మూవీలో రిపీట్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ 'అధినాయకుడు' మూవీలో ట్రై చేశారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ'లో జై కుమార్, లవ కుమార్, కుశ కుమార్ గా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ ముగ్గురి తరువాత ట్రిపుల్ యాక్షన్ ఫీట్ ని హీరో నందమూరి కల్యాణ్ రామ్ రిపీట్ చేస్తున్నాడు. తను నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'అమిగోస్'.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్ గా టైమ్ ట్రావెల్ మూవీ 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ఈ మూవీలో డ్యుయెల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 'హరే రామ్', బింబిసార' వంటి సినిమాల్లో ఇప్పటి వరకు డ్యుయెల్ రోల్ లో నటించిన కల్యాణ్ రామ్ తొలిసారి 'అమిగోస్' మూవీలో ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
మైఖేల్, సిద్ధార్ధ్, మంజునాథ్ అనే మూడు విభిన్నమైన క్యారెక్టర్ లలో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. 'అమిగోస్' అంటే స్పానిష్ లో ఫ్రెండ్ అని అర్థం. టైటిల్ నుంచే ఆసక్తిని రేకెత్తించడం మొదలు పెట్టిన ఈ మూవీ కల్యాణ్ రామ్ తొలి సారి ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారని, ఆ పాత్రలకు సంబంధించిన లుక్స్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో అభిమానులని సర్ ప్రైజ్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.
మూడు క్యారెక్టర్లని పరిచయం చేస్తూ రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సంబంధం లేని ముగ్గరు వ్యక్తులు ఒకేలా ఎందుకు వున్నారు?.. ఒకరిని ఒకరు ఎలా పరిచయం చేసుకున్నారు? ఎలా కలిసారు?.. ఎందుకు విడిపోయారు?.. ఆ అవసరం ఎందుకొచ్చింది?.. మిగతా ఇద్దరిని మైఖేల్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అన్నదే ఈ మూవీలోని అసలు కథ. ఫిబ్రవరి 10న భారీ స్థాయిలో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. తొలి సారి త్రిపాత్రాభినయం చేసిన కల్యాణ్ రామ్ ఈ మూవీతో ఆ నలుగురిలా మ్యాజిక్ చేస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.