'అల వైకుంఠపురంలో..' ఈ మార్పు ఎందుకో?

Update: 2019-09-27 11:47 GMT
అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ చాలా గ్యాప్‌ తీసుకుని చేస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్‌ తనదైన శైలిలో ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. బన్నీ ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. కనుక మూడవ సినిమా కూడా హిట్‌ అయ్యి హ్యాట్రిక్‌ సాధించడం ఖాయం అని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

కొన్ని రోజుల క్రితమే సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేసి టీజర్‌ ను కూడా విడుదల చేసిన త్రివిక్రమ్‌ 'సామజవరగమన...' పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ పాటకు సంబంధించిన టీజర్‌ ను కూడా విడుదల చేశారు. ఆ సాంగ్‌ విడుదల సందర్బంగా సోషల్‌ మీడియాలో అల వైకుంఠపురంలో చిత్ర టైటిల్‌ ఇంగ్లీష్‌ అక్షరాలను చూసినట్లయితే కాస్త మార్పు కనిపించింది. టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటికి ఇప్పటికి టైటిల్‌ లో రెండు అక్షరాలను పెంచడం జరిగింది.

మొదట Vaikunthapuramulo అంటూ అల్లు అర్జున్‌ తో పాటు నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. కాని ఈసారి మాత్రం సాంగ్‌ ప్రోమో పోస్ట్‌ చేసిన సమయంలో మాత్రం Vaikunthapurramuloo అంటూ పోస్ట్‌ చేశారు. ఆర్‌ మరియు ఓ లను యాడ్‌ చేశారు. న్యూమరాలజీ ప్రకారం మరో రెండు అక్షరాలను ఇంగ్లీష్‌ టైటిల్‌ కు యాడ్‌ చేసి ఉంటారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్‌ గా జరుగుతూనే ఉంటాయి. సక్సెస్‌ విషయంలో ఏ ఒక్కరు ఛాన్స్‌ తీసుకోవాలనుకోరు. సినిమా ఎంత బాగున్నా కూడా అదృష్టం ఇంకా ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అందుకే త్రివిక్రమ్‌ కూడా ఈ సినిమా టైటిల్‌ విషయంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడనిపిస్తుంది.


Tags:    

Similar News