విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2". స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వివిధ కారణాలతో రెండేళ్ల క్రితమే ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.
నేడు కమల్ హాసన్ 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడికి శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం ఉదయం "ఇండియన్ 2" నుంచి రెండు స్పెషల్ పోస్టర్స్ ని మేకర్స్ ఆవిష్కరించారు.
"ఇండియన్ 2" సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ద్వారా సినిమాలో సేనాపతి పాత్ర ఎంత అగ్రెసివ్ గా ఉంటుందనే విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేశారు.
ఇందులో ఒక పోస్టర్ లో కమల్ హాసన్ యాంగ్రీ మ్యాన్ గా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. మరో చిత్రంలో ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నారు. లోకనాయకుడు పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఈ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
1996లో కమల్ మరియు శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ గా ''ఇండియన్ 2'' తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ - రకుల్ ప్రీత్ సింగ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - బాబీ సింహా - సముద్రఖని - గుల్సాన్ గ్రోవర్ - వెన్నెల కిషోర్ - ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పంజాబీ నటుడు, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు మరియు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
"ఇండియన్ 2" చిత్రాల్ని లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ గైంట్ మూవీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ & ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రైటింగ్ విభాగంలో శంకర్ తో పాటుగా జయమోహన్ - వీరముత్తు - లక్ష్మీ శరవణ కుమార్ వర్క్ చేశారు.
26 ఏళ్ల క్రితం వచ్చిన "భారతీయుడు" సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఇటీవల "విక్రమ్" సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్ హాసన్.. "భారతీయుడు 2" చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఈ విజిలెంట్ యాక్షన్ మూవీని 2023 అక్టోబర్ 14న విడుదల చేయనున్నారని టాక్ నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.